ఆంధ్రప్రదేశ్‌

ఈతకెళ్లి నలుగురు బాలురు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోసిగి, మే 23: పాఠశాలలకు వేసవి సెలవులు కావడంతో సరదాగా ఈత కొట్టేందుకు వెళ్లి చెరువులోని బురదలో దిగబడి ఊపిరాడక నలుగురు బాలురు మృతిచెందిన సంఘటన సోమవారం కర్నూలు జిల్లా కోసిగి గ్రామంలో చోటుచేసుకుంది. 8 నుంచి 12 ఏళ్ల వయసు కల్గిన ఆరుగురు బాలురు ఇంటి వద్ద మధ్యాహ్నం భోజనం చేసి ఈత కొట్టేందుకు గ్రామానికి కిలోమీటర్ దూరంలో ఉన్న బుగేనిచెరువుకు వెళ్లారు. ఈత కొడుతున్న సమయంలో బురదలో దిగబడి ఊపిరాడక బోయ నరసింహులు (10), అయ్యప్ప (8), వెంకటేశ్వర్లు (10), కురుబ నరసింహులు (8) మృతిచెందారు. వీరితో పాటు వెంకటేశ్వర్లు సోదరులు తిప్పయ్య, గోవిందు కూడా ఈతకు వెళ్లారు. అయితే వారు ప్రమాదం నుంచి బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్థులు చెరువు వద్దకు వెళ్లి మృతదేహాలను బయటకు తీశారు.సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించారు.