ఆంధ్రప్రదేశ్‌

వాగునీరూ వృథా కాదు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, మే 24: ఆంధ్రప్రదేశ్‌లో నీటి కొరతను అధిగమించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వం వాగులు, వంకల ద్వారా వృథాగా పోయే జలాలను సైతం ఒడిసిపట్టే ప్రయత్నం చేస్తోంది. వృథాగా పోయే కొండ కోనల్లోని వాగులు, సెలయేర్ల నీటిని సద్వినియోగం చేయడానికి రిజర్వాయర్లకు అనుసంధానం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తూర్పు కనుమల్లోని పాములేరు వాగుపై సాగునీటి ప్రాజెక్టుకు అంకురార్పణ పలికారు. పాములేరు వాగులో నీటి లభ్యత సుమారు 8 టిఎంసిలు ఉంటుందని అంచనా. అందులో నికరంగా నాలుగు టిఎంసిలు వినియోగించుకోవడానికి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. ఇందుకు ప్రాథమిక సర్వే కూడా పూర్తయింది. ప్రభుత్వానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డిపిఆర్) సమర్పించవలసి ఉంది. ఆ దిశగా కసరత్తు జరుగుతోంది. ప్రాథమిక అంచనా ప్రకారం.. ఈ ప్రాజెక్టుకు సుమారు రూ.500 కోట్ల వరకూ ఖర్చు కావచ్చు. తూర్పు గోదావరి జిల్లా మారేడుమిల్లి మండలంలోని కొండ ప్రాంతంలోని పాములేరు వాగు నీటిని మళ్లించి, జిల్లాలోని భూపతిపాలెం, సూరంపాలెం రిజర్వాయర్ల ద్వారా ఏలేరు ప్రాజెక్టుకు అనుసంధానం చేయనున్నారు. ఏటా వర్షాకాలంలో ఉద్ధృతంగా ప్రవహించే పాములేరు వాగునీరు వృథాగా సముద్రం పాలవుతోంది. అలాకాకుండా సద్వినియోగం చేసుకోవాలని, ఇందుకు ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సూచించారు. ఈ సూచనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సూత్రప్రాయంగా అంగీకరించడంతో, ప్రాథమిక సర్వే పూర్తిజేసి ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. మారేడుమిల్లి మండలం కుట్రవాడ గ్రామం వద్ద పాములేరు వాగు ఒక మేజర్ కొండవాగుగా ఉంది. వాగుకు దిగువన సీతపల్లి వాగు ప్రవహిస్తోంది. సీతపల్లి వాగుపై ఇప్పటికే భూపతిపాలెం, సూరంపాలెం ప్రాజెక్టులు నిర్మించారు. పాములేరు ప్రాజెక్టు ద్వారా గ్రావెటీతో నీటిని ఏలేరుకు అనుసంధానం చేయనున్నారు. మారేడుమిల్లి మండలం కుట్రవాడ గ్రామం వద్ద 15మీటర్ల నుండి 50 మీటర్ల డీప్ కట్‌ను ఏడు కిలోమీటర్ల మేర తవ్వుతారు. ఈ నీటిని గ్రావెటీ ద్వారా ముందుగా భూపతిపాలెం రిజర్వాయర్‌కు, అక్కడ నుండి సూరంపాలెం రిజర్వాయర్‌కు మళ్లిస్తారు. అక్కడ నుండి ఏలేరుకు అనుసంధానం చేస్తారు. కూడూరు, మారేడుమిల్లి, సూరంపాలెం, సున్నంపాలెం, భూపతిపాలెం, నల్లిగడ్డ మీదుగా కాలువలు తవ్వుతారు. మొత్తం 115 కిలోమీటర్ల కాలువ వ్యవస్థ రూపొందిస్తారు. కనీస స్థాయిలో నాలుగు టిఎంసిల వాడకం కోసం ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. పాములేరువాగు ప్రాజెక్టు పూర్తయితే ఏలేరు రిజర్వాయరు కింద ఇప్పటికే 65 వేల ఎకరాల ఆయకట్టుకు తోడు 90వేల ఎకరాలకు స్థిరీకరణ కలగనుంది.