ఆంధ్రప్రదేశ్‌

రేణిగుంటలో డికెటి భూమాయ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రేణిగుంట, మే 26: కోట్ల విలువచేసే డికెటి భూములను చిత్తూరు జిల్లా సహకార బ్యాంక్ అధికారులు వేల రూపాయలకే అప్పనంగా అందించిన వైనం తిరుపతి సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలనలో వెలుగుచూసింది. తీవ్రంగా స్పందించిన ఆయన తక్షణం ఆ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ భూములని బోర్డు పెట్టాలని ఈనెల 5వ తేదీన రేణిగుంట తహశీల్దార్‌ను ఆదేశించారు. అయితే రెవెన్యూ అధికారులు ఆ భూములను స్వాధీనం చేసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఈవ్యవహారం మీడియాకు ఉప్పందడంతో సదరు రెవెన్యూ అధికారులను ప్రశ్నించారు. ఆ భూములు ఎక్కడున్నాయో తెలియదంటూ చేతులు దులుపుకొన్నారు. ఇంతకూ భూములను వేలంలో కొన్నది ఎవరోకాదు. జిల్లా సహకార బ్యాంక్ కాయంపేట శాఖ డైరెక్టర్, జిల్లా శాఖకు డైరెక్టరైన నాగరాజు. గుట్టుచప్పుడు కాకుండా సాగిన ఈ కుంభకోణం కాని భూ కుంభకోణం తాను కొన్న డికెటి భూములను పట్టా ఇవ్వాలని సదరు వ్యక్తి సబ్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకోవడంతో అసలు విషయం బయటపడింది. రేణిగుంట మండలం సూరప్పకశం లెక్కదాఖలాల్లోని 667/1 సర్వేనెంబర్‌లోని, 5 ఎకరాల 54 సెంట్లను దళితుడైన యు గోవిందస్వామి ఆధీనంలో ఉంది. 2006 ఫిబ్రవరి 18న ఆ భూమిని ఆయన మనువడు శశికిరణ్ పేరుతో మార్చుకున్నారు. గోవిందస్వామి 2006 నవంబర్ 12న చనిపోయాడు. అయితే 2007 ఫిబ్రవరి 23న గోవిందస్వామికి ఐదు ఎకరాల 54 సెంట్లు తనఖా పెట్టుకుని సహకార బ్యాంకు రుణం మంజూరు చేయడం గమనార్హం. ఆ తరువాత ఆ రుణాన్ని జి.శశికిరణ్ పేరుతో బదిలీ చేశారు. శశికిరణ్ ఆ రుణాన్ని చెల్లించకపోవడంతో వడ్డీతో సహా రూ.17,300 లు చెల్లించాలని 2014 ఏప్రిల్ 19న నోటీసులు ఇచ్చారు. చివరకు ఆ భూమిని వేలం వేసి శశికిరణ్ నుంచి నాగరాజు అనే వ్యక్తికి ఒక లక్ష 20,950 రూపాయలకు వేలంలో విక్రయించినట్లు 2014 సెప్టెంబర్ 26న పి ఎ సి ఎస్, కో ఆపరేటివ్ బ్యాంకు అధికారులు ధ్రువపత్రాన్ని నాగరాజుకు అందించారు. వాస్తవానికి ఈ ధ్రువపత్రాన్ని ఇచ్చేముందు రెవెన్యూ అధికారులను సంప్రదించాలన్న సాంప్రదాయాన్ని కూడా పాటించలేదు. వేలం వేసే నాటికి సదరు భూమి ఎకరాకు ప్రభుత్వ నిర్ణీత ధర రూ.7లక్షలు పలుకుతున్నా ఇరవై వేలు ధర నిర్ణయంచారు. ప్రస్తుతం సదరు ఆ భూమి ఎకరా రూ.3కోట్లకు పైగా ఉందని అంటున్నారు. రూ.15కోట్లకు పైగా విలువచేసే భూమిని కేవలం ఒక లక్ష 20వేలకే దక్కించుకున్నారు. పి ఏ సి అధికారులు, కో ఆపరేటివ్ బ్యాంక్ అధికారులు కొందరు వ్యక్తులతో చేతులు కలిపి అవకతవకలకు పాల్పడ్డారన్న అంశం సబ్ కలెక్టర్ హిమాంశు శుక్లా పరిశీలతో తేలింది.