ఆంధ్రప్రదేశ్‌

రెండో రోజు ఈసెట్-2016 ప్రశాంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, మే 26: ఈసెట్-2016 రెండవ రోజైన గురువారం ప్రశాంతంగా జరిగింది. రాష్ట్రంలో ఆరు రీజినల్ సెంటర్ల పరిధిలోని 79 కేంద్రాల్లో ఈ ప్రవేశ పరీక్షలు నిర్వహించారు. అన్ని కేంద్రాల్లో రెండవ రోజుపరీక్షలు జరిగినట్టు జెఎన్‌టియుకె ఓ ప్రకటనలో తెలిపింది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ విభాగానికి సంబంధించి 7468 మంది దరఖాస్తు చేసుకోగా 6563మంది హాజరయ్యారు. 88.87 శాతం హాజరు నమోదయ్యింది. బయోటెక్నాలజీ విభాగానికి సంబంధించి 104 మంది దరఖాస్తు చేసుకోగా 48 మంది పరీక్షకు హాజరయ్యారు. 56 మంది గైర్హాజరు కాగా 46.15 శాతం హాజరు నమోదయ్యింది. ఏరోస్పేస్ విభాగానికి సంబంధించి 59 మంది దరఖాస్తు చేసుకోగా 50 మంది హాజరు కాగా 9 మంది గైర్హాజరయ్యారు. 80.74 శాతం హాజరు లభించింది. ఫుడ్ టెక్నాలజీ సంబంధించి 52 మంది దరఖాస్తు చేసుకోగా 42 మంది హాజరు కాగా 10 మంది గైర్హాజజరయ్యారు. 80.86 శాతం హాజరు నమోదయ్యింది. 5592 మంది మెకానికల్ విభాగానికి సంబంధించి దరఖాస్తు చేసుకోగా 4939మంది హాజరు కాగా 663మంది గైర్హాజరయ్యారు. మొత్తం 86.17 శాతం హాజరు లభించింది. 5065 మంది ఎలక్ట్రికల్ విభాగానికి సంబంధించి దరఖాస్తు చేసుకోగా 4565 మంది హాజరు కాగా 700 మంది గైర్హాజరయ్యారు. 86.17 శాతం హాజరు నమోదయ్యింది. ఆయా రీజనల్ సెంటర్ల పరిధిలో ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, కెమికల్ పరీక్షలను శుక్రవారం ఉదయం 10నుండి మధ్యాహ్నం 12గంటల వరకు నిర్వహిస్తామని ఎపి పిజిఈసెట్-2016 కన్వీనర్ డాక్టర్ జివిఆర్ ప్రసాదరాజు చెప్పారు.