ఆంధ్రప్రదేశ్‌

ఏం చేశారని సంబరాలు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మడకశిర, మే 26: ప్రధానమంత్రిగా నరేంద్రమోదీ అధికారం చేపట్టిన రెండేళ్ల కాలంలో జరిపిన విదేశీ పర్యటనల కారణంగా దేశంలో ఆహార ఉత్పత్తులు, వస్తువుల ఎగుమతులు తగ్గిపోయి తీరని నష్టం జరిగిందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎన్.రఘువీరారెడ్డి విమర్శించారు. గురువారం అనంతపురం జిల్లా మడకశిరలో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ నరేంద్రమోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు గోద్రా సంఘటనలో ముస్లింల ఊచకోతతో సంబంధం ఉందన్న ఆరోపణల నేపధ్యంలో అప్పట్లో విదేశీ పర్యటనలకు పాసుపోర్టు లభించలేదన్నారు. ప్రధాని అయిన తర్వాత దేశాభివృద్ధిని వదిలి విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో ప్రధానులు ఎవరైనా విదేశీ పర్యటనలు చేస్తే ఆహారధాన్యాలు, తదితర వస్తువుల ఎగుమతులు పెరుగుతుండేవని, బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎగుమతులు తగ్గిపోయాయన్నారు. రోజురోజుకు ధరలు పెరిగిపోతున్నా వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ప్రపంచ దేశాల్లో డీజల్, పెట్రోలు ధరలు భారీగా తగ్గితే మనదేశంలో వాటి ధరలు మరింత పెంచి వాహనదారుల నడ్డివిరుస్తున్నారని రఘువీరా ఆందోళన వ్యక్తం చేశారు. భూసేకరణ చట్టానికి తూట్లుపొడిచి 10 మంది పారిశ్రామికవేత్తల కోసం రైతుల ప్రయోజనాలను ఫణంగా పెడుతున్నారన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మానవవనరులశాఖ మంత్రి స్మృతి ఇరానీ తమ విద్యార్హతలను ఇప్పటి వరకు ప్రకటించలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన చట్టాలను బిజెపి ప్రభుత్వం నీరుగార్చుతోందన్నారు. ఆహారభద్రత, విద్యాహక్కు, సమచారహక్కు చట్టాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. బిజెపి ఒత్తిడి కారణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిందన్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం నెరవేర్చడం లేదన్నారు. దేశంలో కరవు పరిస్థితులు చోటు చేసుకుని ఆహారధాన్యాలు, తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే బిజెపి నేతలు సంబరాలు చేసుకుంటున్నారని ఆరోపించారు. బిజెపి ఇప్పటికే ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందన్నారు.