ఆంధ్రప్రదేశ్‌

11 నెలల చిన్నారి కిడ్నాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 26: విశాఖ నగరంలో 11 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం సృష్టించింది. నగరంలోని మద్దిలపాలెం పిఠాపురం కాలనీలో ఒక అపార్టుమెంట్‌లో వాచ్‌మెన్‌గా పని చేస్తున్న రాంబాబు, సుధారాణి కుమారుడు 11 నెలల నవదీప్ గురువారం కిడ్నాప్‌కు గురయ్యాడు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో బాలుడిని సెల్లార్‌లో ఉయ్యాలలో నిద్రపుచ్చి రాంబాబు, సుధారాణి తమ పనులు చూసుకుంటున్నారు. అదే సమయంలో ఇద్దరు సవరాలు అమ్ముకునే మహిళలు వచ్చి సవరాలు విక్రయిస్తామని వాచ్‌మెన్ దంపతులతో చెప్పారు. తమకు అవసరం లేదని వారు చెప్పడంతో తిట్టుకుంటూ వెళ్లిపోయారని రాంబాబు తెలిపారు. తమ పనులు ముగించుకుని కొద్ది సేపటి తరువాత వచ్చి చూస్తే ఉయ్యాలలోని చిన్నారి లేడని తెలిపారు. సవరాలు అమ్మేందుకు వచ్చిన మహిళలలే కిడ్నాప్ చేసి ఉంటారని రాంబాబు దంపతులు వాపోయారు.