ఆంధ్రప్రదేశ్‌

ప్రకాశం, నెల్లూరుల్లో వైకాపా ఖాళీ?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు/నెల్లూరు, మే 26: ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా మారింది. తాజాగా ప్రకాశంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి సమక్షంలో త్వరలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వినికిడి. ఈమేరకు మంతనాలు కూడా జరిగాయని విశ్వసనీయంగా తెలిసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, కందుకూరు శాసనసభ్యుడు పోతుల రామారావులు ఈనెల 28వ తేదీ లేదా జూన్ ఒకటవ తేదీన తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు. ముఖ్యంగా తిరుపతిలో జరిగే మహానాడు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలోనే టిడిపిలో చేరే అవకాశాలున్నటుట సమాచారం. ఈపాటికే బుధవారం ముఖ్యమంత్రిని విజయవాడలో వారిద్దరూ కలిసి, పార్టీలో చేరే విషయాలపై చర్చించిన మీదట ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా గిద్దలూరు, కందుకూరు నియోజకవర్గాల్లోని మండలాలవారీగా పార్టీనేతలతో గురువారం వారిద్దరూ సమావేశమై భవిష్యత్తు వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. అదేవిధంగా సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ వైసిపిలోనే కొనసాగుతారా లేక తెలుగుదేశంపార్టీ గూటికి చేరుతారా అన్న చర్చ కూడా జిల్లావ్యాప్తంగా సాగుతుంది. ఆదిమూలం కూడా తెలుగుదేశంపార్టీ గూటిలోకి చేరితే మార్కాపురం శాసనసభ్యుడు జంకె వెంకటరెడ్డి ఒక్కరు మాత్రమే వైసిపిలో ఉండనున్నారు. కాగా హైదరాబాద్‌లో గురువారం వైకాపా కేంద్ర కమిటీ సమావేశానికి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పోతుల, ముత్తముల గైర్హాజరుకావడం ఇందుకు బలంగా కారణంగా కన్పిస్తోంది. మొత్తంమీద రాజ్యసభ ఎన్నికలు జరగకముందే జిల్లాలోని వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి ఖాళీ అయ్యే పరిస్థితి కన్పిస్తోంది. ఇదిలావుండగా నెల్లూరు జిల్లాలో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలకు టిడిపి గాలం వేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తన మాతృ పార్టీలోకి తిరిగి వచ్చారు. జిల్లాకు చెందిన మరో ఇద్దరు వైసిపి ఎమ్మెల్యేలను టిడిపిలో చేర్చుకునేందుకు టిడిపి అధిష్టానం పావులు కదుపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు స్థానిక టిడిపి నేతలతో తరచూ టచ్‌లోనే ఉంటున్నారు. జిల్లాకు చెందిన ఒక వైసిపి ఎమ్మెల్యే నిన్నటి దాకా పార్టీ మారుతున్నట్టు వార్తలు వచ్చినప్పుడు ఆయనే దాన్ని ఖండించడం కూడా జరిగింది. అయినప్పటికీ ఆయన టిడిపిలో చేరే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం. అదే కోవలో మరో వైసిపి ఎమ్మెల్యేను కూడా త్వరలో టిడిపిలోకి తీసుకువచ్చేందకు ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. రాజ్యసభ టికెట్ ఆశిస్తున్న సదరు పారిశ్రామికవేత్త వైసిపి ఎమ్మెల్యేలు అధికంగా జిల్లా నుంచి ఎమ్మెల్యేలను టిడిపిలో తీసుకురావడం ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబునాయుడు వద్ద మార్కులు పొందాలనే ఆలోచనలో ఆయన ఉన్నట్లు తెలిసింది.