ఆంధ్రప్రదేశ్‌

‘గార్డెన్ రీచ్’ నుంచి మరిన్ని యుద్ధ నౌకలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, అక్టోబర్ 16: భారత నౌకాదళానికి మరిన్ని యుద్ధనౌకలను కోల్‌కత్తాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ తయారు చేయనుందని గార్డెన్ రీచ్ సిఎండి వి.కె.సక్సేనా తెలియజేశారు. 81 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఐఎన్‌ఎస్ కిల్తాన్‌ను విశాఖలోని నేవల్ డాక్‌యార్డులో సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకూ గార్డెన్ రీచ్ షిప్‌యార్డును 600 కోట్ల రూపాయలతో ఆధునీకరించామని అన్నారు. దీనివలన నౌకా నిర్మాణ సామర్థ్యం రెట్టింపు అయిందని ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ 95 యుద్ధ నౌకలు తయారుచేశామని అన్నారు. 2014 నుంచి మారిషస్ నేవీ కోసం యుద్ధనౌకలను ఇక్కడే తయారుచేసి పంపిస్తున్నామని తెలియజేశారు. భారత నౌకాదళానికి అత్యాధునిక యుద్ధ నౌకలను తయారు చేస్తున్నామని సక్సేనా చెప్పారు. ఈ ఏడాది ఆరు నౌకలు డెలివర్ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, కిల్తాన్ మూడవదని ఆయన వివరించారు. వచ్చే ఏడాది నాలుగు యుద్ధ నౌకలు జలప్రవేశం చేయిస్తామని చెప్పారు.