ఆంధ్రప్రదేశ్‌

గడువులోగా పూర్తి చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులన్నింటినీ గడువులోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అధికారులను ఆదేశించారు. పోలవరం ప్రాజెక్టు, మరో 28 ప్రాజెక్టుల నిర్మాణ పనుల పురోగతిపై సచివాలయంలో ఆయన సోమవారం సమీక్షించారు. ముఖ్యంగా అనంతపురం జిల్లా (గొల్లపల్లి రిజర్వాయర్ పరిధిలో) మడకశిరి బ్రాంచి కెనాల్, చిత్తూరు జిల్లా హంద్రీ-నీవా రెండో దశలో భాగమైన అడవిపల్లి ప్రాజెక్టు, కెఎల్ రావు పులిచింతల ప్రాజెక్టు, గండికోట సిబిఆర్ లిఫ్టు పనులను నవంబర్‌లోగా పూర్తిచేయాలని ఆయన ఆదేశించారు. నెల్లూరు జిల్లా సంగం రిజర్వాయర్ పనులను ఈ నెలాఖరుకు పూర్తిచేయాలని కోరారు. మడకశిర బ్రాంచి కెనాల్ పనుల్లో రైల్వే క్రాసింగ్ దగ్గర పనులు, పెన్నానది దాకా ఆకృతుల నిర్మాణం క్లిష్టతరమైనదని వీడియో కాన్ఫరెన్స్‌లో అనంతపురం జిల్లా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అడవిపల్లి రిజర్వాయర్ 99 శాతం పూర్తయిందని అధికారులు వివరించారు. మరోవైపు అనంతపురం జిల్లా మరాల రిజర్వాయర్, చెర్లోపల్లి రిజర్వాయర్ ప్రాజెక్టులు నిర్మాణం పూర్తిచేసుకుని ప్రారంభోత్సవానికి సిద్ధమయ్యాయి. ఇప్పటిదాకా పోలవరం ప్రాజెక్టులో 3.43 లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు పూర్తయ్యాయి. మట్టి తవ్వకం పనులు 759 లక్షల క్యూబిక్ మీటర్ల మేర పూర్తిచేశారు. పోలవరం ప్రాజెక్టు దగ్గర నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్న పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ రమేష్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్ లైవ్‌లో మాట్లాడారు. వర్షాల కారణంగా పోలవరం ప్రాజెక్టు పనులకు అంతరాయం కలుగుతోందని ఆయన వివరించారు.
హారతి తర్వాత 810 టిఎంసిల జలాలు
రాష్ట్ర వ్యాప్తంగా గత నెలలో ప్రజల్లో జల చైతన్య కార్యక్రమంగా నిర్వహించిన ‘జలసిరికి హారతి’ ప్రభావాన్ని చంద్రబాబు సమీక్షించారు. రాష్టవ్య్రాప్త ఆడిట్ చేశాక 810 టిఎంసిల జలాలు వచ్చాయని తేలిందని, గత ఆరు నెలల్లో నిల్వచేసిన నీటిలో ఇది 56 శాతంతో సమానమని ఆయన చెప్పారు. జలసిరికి హారతి తర్వాత ప్రాజెక్టులు సహా అనేక చెరువులు నిండాయని అధికారులు ‘జలశోభ’ అనే పేరుతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ముఖ్యమంత్రి రియల్ టైమ్ వివరాలను తెలుసుకున్నారు. వర్షాలు పడటంతో రబీ సాగుకు రాష్టమ్రంతా పరిస్థితి ఆశాజనకంగా మారిందని చంద్రబాబు అన్నారు. వర్షాల వల్ల వచ్చిన ఉపరితల జలాలను భూగర్భ జలాలుగా మార్చాలన్నారు. వర్షాల ప్రభావం ఎలా ఉందో పరిశీలించాలని సూచించారు. నిన్నటిదాకా ఇన్‌ఫ్లో 4,390 టిఎంసిలు ఉంటే అదంతా వర్షపాతం వల్ల, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వరద నీటి వల్లేనని ఆడిట్ నివేదికలో వివరించారు. రాష్ట్రంలో 600 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, ఇప్పుడు మొబైల్ ఇరిగేషన్‌కు అనువుగా చెరువులు నిండాయని, 13 జిల్లాల్లో 9 జిల్లాల్లో గత ఏడాది కంటే బాగా వర్షాలు పడ్డాయని నివేదిక పేర్కొంది. జల సంరక్షణను మరింత సమర్ధంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. వర్షాలు కొంతకాలం వెనుకబడి ఆకస్మికంగా కరవు ఏర్పడితే పరిస్థితిని ఎదుర్కోవడానికి జలసంరక్షణ, నీటి యాజమాన్య నిర్వహణతో సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు పిలుపునిచ్చారు.