ఆంధ్రప్రదేశ్‌

ఆదాయంలో ‘కృష్ణా’ టాప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: వృద్ధిపై దృష్టి నిలపడమే కాకుండా వ్యయ నియంత్రణలో పట్టు సాధించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. జీతభత్యాలకే సరిపోయేలా కొన్ని శాఖల్లో వృద్ధి మందగమనంలో ఉండటం ఇబ్బందికరమని అన్నారు. ఖర్చులను అదుపు చేయడం అన్నింటి కంటే పెద్ద కసరత్తు అని వ్యాఖ్యానించారు. సోమవారం రాత్రి ఆదాయార్జన శాఖల పురోగతిని ఆయన సమీక్షించారు. 2017-18 ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ వరకు సాధించిన ప్రగతిని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆయా శాఖల అధికారులతో సోమవారం సాయంత్రం సమీక్షించారు. రాష్ట్ర ఆదాయ ఆర్జిత శాఖలు 13.26 శాతం వృద్ధితో రూ.25,834 కోట్ల ఆదాయాన్ని ఆర్జించాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. శాతాల లెక్కలో చూసుకుంటే 140.63 శాతం వృద్ధితో అటవీశాఖ అగ్రస్థానంలో ఉంది. అయితే, ఆదాయ పరంగా చూస్తే మిగిలిన అన్ని శాఖలతో పోల్చితే రూ.64.19 కోట్ల ఆదాయంతో ఈ శాఖ చివరి స్థానంలో నిలిచింది. అత్యధిక ఆదాయం ఆర్జించిన శాఖల్లో రాష్ట్ర వాణిజ్యపన్నుల శాఖ రూ.18,090.84 కోట్ల ఆదాయంతో ముందు వరుసలో ఉంది. రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖలో ఆదాయ వృద్ధి 1.48 శాతం తగ్గింది. ఈ శాఖ సెప్టెంబర్ వరకు రూ.2,024 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ల్యాండ్ రెవిన్యూ శాఖలో వృద్ధి తిరోగమనంలో ఉంది. వృద్ధిలో ఈ శాఖ 24.08 శాతం వెనుకబడి ఉంది. ఆదాయం రూ.99.76 కోట్లు ఉంది. భూగర్భ గనుల శాఖ రూ.862 కోట్ల ఆదాయంతో, 16 శాతం వృద్ధి సాధించింది. రవాణా శాఖలో వృద్ధి 27.10 శాతంగా ఉంది. రూ.1,532.10 కోట్ల ఆదాయాన్ని సాధించింది. రాష్ట్రంలో ఈ సెప్టెంబరు వరకు ఆదాయ ఆర్జనలో కృష్ణాజిల్లా రూ.8,471.87 కోట్ల ఆదాయంతో తొలి స్థానంలో ఉంది. రూ.6,842.35 కోట్ల ఆదాయంతో విశాఖపట్నం జిల్లా రెండవ స్థానంలో నిలిచింది. రూ.364.46 కోట్ల ఆదాయంతో విజయనగరం జిల్లా చివరి స్థానంలో ఉంది. జిఎస్‌టీ అమలు తరువాత రాష్ట్రంలో 81782 మంది డీలర్లు కొత్తగా నమోదయ్యారని అధికారులు చెప్పారు. దీంతో రాష్ట్రంలో డీలర్ల సంఖ్య 2,92,000కు చేరిందని తెలిపారు.