ఆంధ్రప్రదేశ్‌

పునరావాస బాధితుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 16: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యల్ని ప్రభుత్వం పరిష్కరించకుండా వాటి నిర్మాణం కోసం గడ్డపార మట్టి వేసి అడ్డుకుంటాం... ప్రభుత్వంపై ఎలాంటి యుద్ధానికైనా సిద్ధమమే.. మీకు చేతనైందీ చేస్కోండి... అరెస్టులూ, జైళ్లకూ వెళ్ళేందుకు తామంతా సిద్ధంగా ఉన్నాం. బాధితులకు అండగా వామపక్ష పార్టీలుంటాయి... నిర్వాసితులూ బెదరకుండా ఉద్యమంలోకి రండి అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం విజయవాడ అలంకార్ థియేటర్ దగ్గర సోమవారం 10 వామపక్ష పార్టీల ఆధ్వర్యాన బాధితులతో కలిసి 30 గంటల మహాధర్నాను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశానికి అధ్యక్షవర్గంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణమూర్తి, సిపిఎం రాష్టన్రేత, మాజీ ఎంపి మిడియం బాబూరావు వ్యవహరించారు. బాధితుల మహాధర్నా శిబిరానికి విచ్చేసిన నారాయణ మాట్లాడుతూ పోలవరాన్ని నిజంగా కట్టాలంటే సిఎం చంద్రబాబు కేంద్రంతో మాట్లాడాలన్నారు. ముందు రాజకీయపరమైన నిర్ణయం తీసుకోవాలని, అఖిల పక్షాన్ని కేంద్రానికి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి కేంద్రం నిర్మాణ బాధ్యతలకు ముందకొస్తే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కేంద్రానికి అప్పగించలేదని ప్రశ్నించారు. కేంద్ర మంత్రి గడ్కరీ ఇటీవల పోలవరం ప్రాజెక్టును సందర్శించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినప్పటికీ వాటిని తెచ్చుకోవడంలో చంద్రబాబు విఫలమయ్యారని విమర్శించారు. పోలీసుల భద్రతా వలయంలో వంశధార ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తుందా.. ఇది పాకిస్తానా.. శ్రీలంకా అని ఆయన ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టుకు మొదట అంగీకారం తెలిపిందీ కమ్యూనిస్టులేనని ఆయన గుర్తు చేశారు. ఉభయగోదావరి జిల్లాల్లోని పోలవరం ప్రభావిత ప్రాంతాల్లో సర్వే పూర్తవ్వకుండా నిర్వాసితుల్ని ఎలా తరలిస్తారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. 2018 నాటికి పోలవరాన్ని కట్టి తీరుతానని సిఎం ప్రగల్భాలు పలుకుతున్నారని, నిధులు లేకుండా ఎలా కడతారన్నారు. రాష్ట్ర మంత్రులు నిర్వాసితుల సమస్యపై స్పందించే తీరికలేకపోయిందని, వారంతా లిక్కర్, ఇసుక, మైనింగ్ మాఫియాలో మునిగిపోయారని విమర్శించారు. ఈ ధర్నాను ఉద్దేశించి భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, మాజీ ఎంపి, సిపిఎం నేత మిడియం బాబురావు, అఖిల భారత రైతు సంఘం ఉపాధ్యక్షులు రావుల వెంకయ్య, మాజీ వ్యవసాయ మంత్రి వడ్డేశోభనాద్రీశ్వరరావు వివిధ వామపక్ష పార్టీల నేతలు ప్రసంగించారు.