ఆంధ్రప్రదేశ్‌

సమ్మె బాటలో నూజివీడు ట్రిపుల్ ఐటి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ/నూజివీడు, అక్టోబర్ 17: కృష్ణాజిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల మరణాలు, అధ్యాపకుల సమ్మె సంఘటనలపై రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు, అధికారులతో ఆర్టీయూకెటి వైస్ చాన్సలర్ రామచంద్రరాజు మంగళవారం సంప్రదింపులు జరిపారు. ఈ మేరకు ట్రిపుల్ ఐటి అధ్యాపకులతో ఆయన సమావేశమై చర్చలు జరిపారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు.
రాజీవ్‌గాంధీ సాంకేతిక వైజ్ఞానిక విశ్వవిద్యాలయం పరిధిలోని నూజివీడు ట్రిపుల్ ఐటీలో పనిచేస్తున్న అధ్యాపకులు జి ఫణికుమార్‌పై సర్కిల్ ఇనస్పెక్టర్ వ్యవహరించిన దుడుకు వైఖరికి నిరసనగా ట్రిపుల్ ఐటీల్లో పనిచేస్తున్న అధ్యాపకులు, సిబ్బంది మంగళవారం సమ్మె జరిపారు. అధ్యాపకులు తరగతులు, సిబ్బంది విధులను బహిష్కరించారు. దీంతో ట్రిపుల్ ఐటీల్లో చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులు వసతిగృహాలకే పరిమితం అయ్యారు. నూజివీడు ట్రిపుల్ ఐటీలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన విద్యార్థిని డి రమాదేవి అనుమానాస్పద మృతి సంఘటనను పురస్కరించుకుని అధ్యాపకులు, చీఫ్ వార్డెన్ ఫణికుమార్‌ను స్థానిక సిఐ రామ్‌కుమార్ స్టేషన్‌కు తీసుకువెళ్ళి అవమానకరంగా వ్యవహరించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన అధ్యాపకులు, సిబ్బంది సమ్మెకు దిగారు. నూజివీడులో అధ్యాపకుల సమ్మెకు సంఘీభావంగా కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటిలో పనిచేస్తున్న సిబ్బంది, అధ్యాపకులు కూడా విధులు బహిష్కరించి సమ్మెలోకి దిగి మద్దతు ఇచ్చారు. ఆర్జేయుకెటీ యాజమాన్యం అనుమతి లేకుండా అధ్యాపకుడ్ని ఎందుకు విచారించారని పోలీసులను ప్రశ్నించారు. మంగళవారం ఉదయం నూజివీడు డిఎస్‌పి వి శ్రీనివాసరావు అధ్యాపకులతో మాట్లాడుతూ జరిగిన సంఘటనను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళానని, ప్రత్యేక బృందంతో విచారణ చేయిస్తారని చెప్పారు. విశ్వవిద్యాలయం ఉపకులపతి వి రామచంద్రరాజు మాట్లాడుతూ అధ్యాపకులు సమస్యలు ఉంటే నేరుగా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ విదంగా తరగతులు బహిష్కరించి, సమ్మెలోకి దిగటం మంచి పద్దతి కాదని చెప్పారు. అధ్యాపకులతో విసి రామచంద్రరావు, డిఎస్‌పి వి శ్రీనివాసరావు, డైరెక్టర్ వీరంకి వెంకటదాసులు పలు పర్యాయాలు చర్చలు జరిపారు. అధ్యాపకులతో కూడిన టీమ్ జిల్లా ఎస్పీ త్రిపాఠిని కలసి వినతిపత్రాన్ని అందజేశారు. సంఘటనపై విచారణకు అవనిగడ్డ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌ను నియమిస్తున్నట్లు జిల్లా అధికారులు తెలిపారని డిఎస్‌పి వి శ్రీనివాసరావు అధ్యాపకులకు చెప్పారు. ఆందోళన విరమించాలని సూచించారు. దీంతో అధ్యాపకులు ఆందోళన విరమించారు.
ఇంటిబాటలో విద్యార్థులు
నాలుగు రోజుల పరిధిలో ఒక విద్యార్థి ఆత్మహత్య, మరో విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందడంతో పలువురు విద్యార్థులు ఆందోళనకు గురై ఇంటిబాట పట్టారు. విద్యార్థుల్లో నెలకొన్న భయాందోళనలను పొగొట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు విసి రామచంద్రరాజు తెలిపారు.

చిత్రం..నూజివీడు ట్రిపుల్ ఐటిలో తరగతులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న అధ్యాపకులు