ఆంధ్రప్రదేశ్‌

అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాలకు భూముల అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), అక్టోబర్ 18: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా నిర్మించ తలపెట్టిన ప్రభుత్వ ఉద్యోగుల నివాస భవనాల నిర్మాణాల ప్రక్రియ కార్యరూపంలోకి వచ్చింది. హైదరాబాద్ నుంచి తరలివచ్చిన ఉద్యోగులకు సరైన నివాస వసతి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో అమరావతిలోనే నివాస భవనాల కాంప్లెక్సులు నిర్మిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ కార్యాచరణలోకి రావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ఉద్యోగుల నివాస భవనాలతో పాటు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం ఇచ్చిన లేఅవుట్ ప్లాట్ల అభివృద్ధి పనులు కూడా కార్యరూపంలోకి రావడంపై రైతుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ఈమేరకు అంచనాలు, డిజైన్లు, వ్యయ బడ్జెట్ కేటాయింపులతో పాటు ఆయా పనుల నిర్వహణకు కాంట్రాక్ట్ సంస్థల ఎంపిక ప్రక్రియ కూడా పూర్తి చేసుకున్న నేపథ్యంలో బుధవారం ఉదయం సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్, నిర్మాణ సంస్థల ప్రతినిధులు, రైతు ప్రతినిధులు ఆయా భూములను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా టెండర్ దక్కించుకున్న నిర్మాణ సంస్థలకు ఆయా భూములను అప్పగించారు. ఇక నిర్మాణ పనులు ప్రారంభించటమే తరువాయి. కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం ఒప్పంద కాల పరిమితిలోనే నిర్మాణాలను పూర్తిచేసేందుకు విస్తృత చర్యలు తీసుకుంటున్నారు. కేటగిరి 1, 2, 3లుగా విభజించిన నిర్మాణ పనులకు సంబంధించి ఫేజ్-1 కాంట్రాక్ట్ ఏజెన్సీ నాగార్జున కన్‌స్ట్రక్షన్స్ ఉద్యోగుల భవనాలను నిర్మించనుంది. ఈమేరకు సిఆర్‌డిఎ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ నిర్మాణ సంస్థ ప్రతినిధులతో ఆరు కిలోమీటర్ల మేర విస్తరించిన లింగాయపాలెం నుంచి నేలపాడు వరకూ ఉన్న భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్ నిబంధనల ప్రకారం గడువులోగా ఆయా నిర్మాణాలను పూర్తి చేసేలా కార్యాచరణ రూపొందించామన్నారు. నిర్మాణాల పనుల ప్రారంభ సూచికగా తొలుత చేపట్టాల్సిన భూసార పరీక్షలకు శ్రీకారం చుట్టారు. ప్యాకేజీ-1లో శాసనమండలి, శాసనసభ సభ్యులు, అఖిల భారత స్థాయి ఉద్యోగులైన ఐఎఎస్, ఐపిఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల కోసం 432 ఫ్లాట్లు ఒక్కొక్కరికి 3500 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. 21 లక్షల 69 వేల 358 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ భవనాల కోసం ప్రభుత్వం 700 కోట్ల రూపాయలను కేటాయించినట్టు శ్రీ్ధర్ తెలిపారు. కేటగిరి-2లో గజిటెడ్ అధికారుల గృహాల నిర్మాణానికి సంబంధించిన భూములను ఎల్ అండ్ టి సంస్థకు అప్పగించారు. ఒక్కొక్కటి 15వందల చదరపు అడుగుల వైశాల్యంలో 1968 ఫ్లాట్లను ఈ సంస్థ నిర్మించనున్నది. మొత్తం 35 లక్షల 63 వేల 460 చదరపు అడగుల మేర నిర్మితమయ్యే ఈ సముధాయానికి ప్రభుత్వం 1098 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. కేటగిరి-3లో నాన్ గజిటెడ్ స్థాయి 1, 2 అధికారుల నివాసాలు, నాల్గవ తరగతి ఉద్యోగుల నివాసాలు నిర్మించేందుకు సంబంధిత భూములను షాపూర్జీ పల్లోంజి సంస్థకు అప్పగించారు. నాన్ గజిటెడ్ అధికారులకు 1200 చదరపు అడుగులు, నాల్గవ తరగతి ఉద్యోగులకు 900 చదరపు అడుగుల చొప్పున నిర్మించే 1056 ఫ్లాట్లకు ప్రభుత్వం 854 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. అలాగే రైతులకు తిరిగిచ్చే ప్లాట్లకు చెందిన లేఅవుట్ల పనులకు సంబంధించిన భూములను ఆయా సంస్థలకు బుధవారం కమిషనర్ శ్రీధర్ అప్పగించారు. ఈసందర్భంగా రైతులతో కలిసి శ్రీ్ధర్ వైకుంఠపురం ఆలయాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో సిఆర్‌డిఎ అదనపు కమిషనర్లు సగిలి షణ్మోహన్, బిఎల్ చెన్నకేశవరావు, హౌసింగ్ చీఫ్ ఇంజినీర్ ఎంఎ షుకూర్, ఎస్‌ఇలు ఎం జకరయ్య, సిహెచ్ ధనుంజయ పాల్గొన్నారు.

తప్పదు మరి!

ఆంధ్రభూమి బ్యూరో
విజయవాడ, అక్టోబర్ 18: ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు మరో 800 కోట్ల రూపాయల సెక్యూరిటీ బాండ్లను విక్రయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాకపోవడం, సొంతంగా సమకూర్చుకుంటున్న ఆదాయం తగినంతగా లేకపోవడంతో సెక్యూరిటీ బాండ్లను విక్రయించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిధులు సమకూర్చుకుంటోంది. ఇప్పటికే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దఫదఫాలుగా 5000 కోట్ల రూపాయల మేరకు సెక్యూరిటీలను తనఖా పెట్టి రుణం సమకూర్చుకుంది. అయినప్పటికీ, నిధుల కొరత ఎక్కువగా ఉండటంతో తప్పనిసరి పరిస్థితుల్లో మరో 800 కోట్ల రూపాయలను సమకూర్చుకోనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాల్లో 415 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా వేయగా, రెండు త్రైమాసికాల తరువాత 7,885 కోట్ల రూపాయలకు చేరింది. ద్రవ్య లోటు కూడా ఆర్థిక సంవత్సరాంతానికి 23,054 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా వేయగా, ఇప్పటికే 18,046 కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్రం వివిధ పన్నుల కింద సొంతంగా 29,433 కోట్ల రూపాయల మేర ఆదాయం లభిస్తుందని ఆశించగా, ఇప్పటి వరకూ 23,800 కోట్ల రూపాయలు మాత్రమే లభించింది. దీంతో భారీ లోటు ఏర్పడి, ఖజనాపై తీవ్ర భారం పడుతోంది. పన్నులు కాని పద్దుల కింద 2970 కోట్ల రూపాయలు సమకూరుతుందని భావించినప్పటికీ, 2140 కోట్ల రూపాయలు మాత్రమే లభించింది. కేంద్రం నుంచి వివిధ గ్రాంట్‌ల రూపంలో 20,574 కోట్ల రూపాయలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ 11,837 కోట్ల రూపాయలు మాత్రమే రాష్ట్ర ఖజనాకు చేరింది.
దీనికి తోడు ఉపాధి హామీ పథకం కింద దాదాపు 600 కోట్ల రూపాయల మేర వేతనాల పద్దు కింద విడుదల కావాల్సి ఉంది. జిఎస్‌టి అమలు వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మేర ఆదాయం కోల్పోతోంది. ఇటీవల కొంత జిఎస్‌టి నష్టపరిహారాన్ని విడుదల చేసినప్పటికీ, మదింపులో లోపం కారణంగా కొంత మేర నిధులు తగ్గినట్లు ఇప్పటికే కేంద్రం దృష్టికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. గత ఏడాది పేరుకు పోయిన బిల్లులు కూడా ఈ ఏడాది చెల్లించాల్సి రావడం వంటివి ప్రభుత్వంపై ఆర్థిక భారాన్ని మోపుతున్నాయి. ఈ పరిస్థితి నుంచి గట్టేక్కెందుకు సెక్యూరిటీ బాండ్ల ద్వారా నిధులు సమకూర్చుకుంటోంది.