ఆంధ్రప్రదేశ్‌

ఏపీకి 60 ఐటీ ఐకాన్స్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, విశాఖలో స్థాపనకు సిద్ధం
ఏడాదిలో 500 కంపెనీల ఏర్పాటే లక్ష్యం
బాబు షికాగో పర్యటనలో ఎన్నారైల హామీ
తెలుగువారితో సిఎం చంద్రబాబు భేటీ
సొంత గడ్డలో పెట్టుబడులు పెట్టాలని పిలుపు

అమరావతి, అక్టోబర్ 18: రాష్ట్రంలో పెట్టుబడులే ధ్యేయంగా తొమ్మిదిరోజుల విదేశీ పర్యటనకు వెళ్లిన సిఎం చంద్రబాబు తొలిరోజు అమెరికాలోని షికాగో పర్యటనకు సానుకూల స్పందన లభించింది. విజయవాడ, విశాఖలో 60 ఐటి కంపెనీలు స్థాపించేందుకు ఎన్నారైలు ముందుకొచ్చారు. ఐటి సర్వీసులు, బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్, సాఫ్ట్‌వేర్ ప్రొడక్స్, ఇంజనీరింగ్ సర్వీసెస్, ఎమర్జింగ్ టెక్నాలజీస్ విభాగాల్లో కంపెనీలు నెలకొల్పేందుకు ఎన్నారైలు సంసిద్ధత వ్యక్తం చేశారు. బుధవారం షికాగోకు వెళ్లిన బాబుకు అక్కడి తెలుగువారు, పారిశ్రామికవేత్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అమెరికాలోని పలు ప్రదేశాలకు చెందిన 80కి పైగా ఐటి సంస్థల నిర్వహకులతో భేటీ అయ్యారు. ఆ సందర్భంగా ఐటి సిటీపై సీఎంకు ఐటి టాస్క్ఫోర్స్ చైర్మన్ గారపాటి ప్రసాద్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
విశాఖను మెగా ఐటి సిటీగా, అమరావతిని మేజర్ ఐటి హబ్‌గా మార్చేందుకు ప్రతిపాదించారు. ఏపిలో పెట్టుబడులకు 450మంది భారత పారిశ్రామికవేత్తలు ఆసక్తిచూపుతున్నారన్నారు. ఏపి ఆర్థికాభివృద్ధిమండలితో 100 అవగాహన ఒప్పందాలకు సిద్ధమని స్పష్టం చేశారు. 60 కంపెనీలు దాదాపు 6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. దీనిద్వారా 8వేల మందికి ప్రత్యక్షంగా, 20 వేల మందికి పరోక్షంగా ఉపాథి అవకాశాలు లభిస్తాయని వివరించారు. 12 నెలల్లో ఈ సంస్థలు విశాఖ, విజయవాడలో కొలువుదీరనున్నాయని చెప్పారు. వచ్చే 12 నెలల్లో వీటికి అవసరమైన కార్యాలయ వసతి కల్పించడంతో పాటు, 500 సంస్థలను ఏపి నుంచి కార్యకపాలు ప్రారంభించేలా లక్ష్యంగా పెట్టుకున్నామని బాబుకు వివరించారు.
అనంతరం వారినుద్దేశించి మాట్లాడిన చంద్రబాబు ఏపిలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకురావడం అభినందనీయమన్నారు. సొంత గడ్డలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఉద్యోగ ఉపాధి కల్పించాలన్న వారి లక్ష్యాన్ని అభినందించారు. ప్రభుత్వపరంగా చేయూత అందిస్తామని, అన్నీ సింగిల్‌విండోలోనే అనుమతులివ్వడం ద్వారా సంస్థల ఏర్పాటుకు ముందుకొచ్చే వారిని ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. తెలుగువారు కష్టపడి సంపద సృష్టించి విశ్వ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నానని, రాష్ట్రంలో ప్రజలంతా ప్రభుత్వ పక్షానే ఉన్నారు. దానికి నిదర్శనమే నంద్యాల, కాకినాడ ఎన్నికలు. మాకు చాలా స్పష్టమైన మద్దతు లభించిందని బాబు వారికి వివరించారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ అగ్రగామిగా ఉందని, మీరు అక్కడికి వచ్చి పెట్టుబడులు పెట్టడానికి ఎలాంటి ఇబ్బందీ లేదన్నారు. ఒకవేళ ఏవైనా ఆటంకాలు ఎదురైనా నేరుగా నాతో చెప్పవవచ్చు. నేను తక్షణమే వాటిని పరిష్కరిస్తాను. ప్రజా సమస్యల తక్షణ పరిష్కారానికి మేము ఇక్కడ 1100 నెంబరుతో పరిష్కార వేదిక ఏర్పాటు చేశాం అని బాబు వివరించారు.
అనంతరం సిఎం బృందం డెమోయిన్స్‌కు వెళ్లింది. భారత కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు ఐయోవా స్టేట్ యూనివర్శిటీని సందర్శించారు. రాత్రి 1.30కు వర్చువల్ రియాల్టీ అప్లికేషన్ సెంటర్‌ను సందర్శించారు. రాత్రి 2.30కు ఐఎస్‌యు రీసెర్చి పార్కులో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. గురువారం తెల్లవారుజాము 5.20కు ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐయోవా గవర్నర్ విందు ఇచ్చారు. ఆ తరువాత కర్నూలు జిల్లాలో నిర్మిస్తున్న మెగా సీడ్ పార్కు ప్రాజెక్టుపై 350 మందితో స్టేక్ హోల్డర్స్ కన్సల్టేషన్ వర్క్‌షాప్, టాప్ సైంటిస్టులు, సీడ్ కంపెనీలు, అగ్రికంపెనీల ప్రతినిధులతో కర్నూలు సీడ్ పార్కుపై ప్రజెంటేషన్ ఇచ్చారు.