ఆంధ్రప్రదేశ్‌

ఈ-ఆఫీస్, బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 18: రాష్ట్ర సచివాలయం, శాఖాధిపతుల కార్యాలయాలు, స్వయం ప్రతిపత్తిగల సంస్థలు, అన్ని జిల్లా కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ వ్యవస్థ, బయో మెట్రిక్ హాజరు తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్టవ్య్రాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్, బయోమెట్రిక్ అటెండెన్స్ అమలును పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఒక నోడల్ అథారిటీని నియమించింది. పరిపాలన శాఖ ప్రధాన కార్యదర్శి (రాజకీయం)ని నోడల్ అథారిటీగా, మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ ప్రాజెక్ట్ డైరెక్టర్, పరిపాలన శాఖ ప్రభుత్వ అదనపు కార్యదర్శిలను డెప్యూటీ నోడల్ అథారిటీలుగా నియమించారు. ఈ అథారిటీల విధులు.. సచివాలయంతో పాటు రాష్టవ్య్రాప్తంగా ఈ-ఆఫీస్ వ్యవస్థ, బయో మెట్రిక్ అటెండెన్స్ అమలు పర్యవేక్షణ. ప్రధాన కార్యదర్శి ముఖ్యమంత్రి స్థాయిలో సమీక్షల కోసం నివేదిక రూపొందించడం. పర్యవేక్షణకు కావలసిన ఐటి అప్లికేషన్లను వినియోగించడం. డిఫాల్టర్లపై చర్యలు తీసుకోవడం. కార్యాలయాలను తనిఖీ చేసి తగిన సూచనలు, సలహాలు ఇవ్వడం. రాష్ట్రంలో తనిఖీల కోసం సచివాలయం లేదా ఏదైనా శాఖాధిపతి కార్యాలయం నుంచి సిబ్బందిని పంపడం. ఈ-ఆఫీస్, బయో మెట్రిక్ అటెండెన్స్ సమర్థవంతంగా అమలు కావడానికి కావలసిన చర్యలు తీసుకోవడం. ఈ విషయంలో లక్ష్యాలు సాధించడం కోసం ఐటిఇ అండ్ సి శాఖ కార్యదర్శి నోడల్ అథారిటీకి అవసరమైన ఐటి అప్లికేషన్లను అభివృద్ధి చేయడం, సేకరణ, వినియోగం, హార్డ్‌వేర్ నిర్వహణ. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ పేరిట ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ ఒక ప్రకటనలో విడుదల చేశారు.