ఆంధ్రప్రదేశ్‌

విదేశీ పర్యటనలు ఎవరి కోసం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), అక్టోబర్ 20: విభజన తరువాత రాష్ట్రం అప్పుల ఉబిలో ఉంటే దానిని పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ చార్టెడ్ ఫ్లైట్‌ల్లో షికారు చేస్తున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యన్నారాయణ విమర్శించారు. మంత్రులు పరిటాల, యనమల కాంట్రాక్టులకు సంబంధించి టిటిడిపి నేత రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు స్పందించాలన్నారు. పోలవరం పైనా, బాబు చేస్తున్న విదేశీ పర్యటనలపైనా వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నగరంలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పెట్టుబడులు, పరిశ్రమల కోసం బాబు విదేశీ పర్యటనలు చేస్తే ఎవరికీ అభ్యంతం లేదన్నారు. కాని పెట్టుబడుల పేరుతో హంగు, ఆర్భాటాలతో విదేశాలకు వెళ్లడం సరైన పద్ధతి కాదన్నారు. గడిచిన మూడున్నరేళ్లలో లక్ష కోట్ల రూపాయల అప్పు చేసిన బాబు పాలన నిధుల దుర్వినియోగానికి అద్దం పడుతుందన్నారు. రాష్ట్రంలో రెండు సమ్మిట్లు నిర్వహించినప్పటికీ ఒక్కరూపాయి పెట్టుబడి కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో పది సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా అవకాశం ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసు కోసం ఆదరాబాదరాగా ఇక్కడకు పరిపాలన తరలించారని చెప్పారు. తెలంగాణ తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి స్వయంగా రాష్ట్ర మంత్రులు పరిటాల, యనమలకు కెసిఆర్ ప్రభుత్వ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ముట్టచెప్పారంటూ చేసిన విమర్శలపై మంత్రులు ఎందుకు నోరుమెదపడం లేదన్నారు. రాజధాని నిర్మాణం ఒక్క అడుగు కూడా పడలేదన్నారు. ఇక పోలవరం ప్రాజెక్టు సంబంధించి కేంద్ర మంత్రి గడ్కరీ స్వయంగా పోలవరం కరప్షన్ ఫ్రీ ప్రాజెక్టుగా నిర్మించాలని చెప్పారని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదన్నారు.