ఆంధ్రప్రదేశ్‌

రూ.2.05 లక్షల కోట్ల అప్పులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 20: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2.05 లక్షల కోట్లకు చేరుకోవడం పట్ల ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సిపి ఆందోళన చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు దుబారా అంతా ఇంతా కాదని, అభివృద్ధి సంగతి పక్కన పెట్టి అప్పులను పెంచి రాష్టాన్ని ఎక్కడికి తీసుకువెళుతున్నారని ఆ పార్టీ శాసనసభ్యుడు, పిఏసి చైర్మన్ బుగ్గన రాజేంధ్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. తాను మాత్రమే అనుభవం ఉన్న సిఎంగా రాష్ట్రాన్ని బాగు చేస్తానని నమ్మించి ఇప్పుడు నట్టేట ముంచారని ఆరోపించారు. శుక్రవారం నాడిక్కడ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపుల కోసం చంద్రబాబు మనీ బ్యాక్ స్కీంను అమలు చేస్తున్నారని ఆరోపించారు. కాగ్ నివేదికను అనుసరించి 2014లో రాష్ట్ర విభజన జరిగే నాటికి రూ.96 వేల కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు రూ.2.05 లక్షల కోట్లకు చేరుకోవడం సిగ్గుచేటని అన్నారు. పట్టిసీమతో రూ.1600 కోట్లు వృధా చేశారని, రూ.1000 కోట్లు దుబారా అన్న కాగ్ నివేదికను సిఎం ఏ రకంగా సమర్ధించుకుంటారని నిలదీశారు. ప్రాజెక్టుల గురించి నిలదీస్తే అభివృద్ధికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయని అంటారని తెలిపారు. రాజధాని పేరుతో చంద్రబాబు నాయుడు తిరగని దేశం లేదని, తానే కాకుండా మిగిలిన వారిని తీసుకెళుతూ పెద్ద ఎత్తున డబ్బు దుబారా చేస్తున్నారని విమర్శించారు. చివరకు బోయపాటి, రాజవౌళిలు దిక్కు అయ్యారని అన్నారు. బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డిలు తమ పదవులకు రాజీనామా చేసి టిడిపి టిక్కెట్‌పై పోటీ చేయాలని అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి సాధారణ ఎకానమి క్లాస్‌లో ప్రయాణిస్తే ఇప్పుడు చంద్రబాబు బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించి నిధులను పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నారని అన్నారు. మాట్లాడితే శే్వతపత్రాలు అంటున్న చంద్రబాబు జివో 22 మీద శే్వతపత్రం విడుదలకు సిద్దమా అని ప్రశ్నించారు. ప్రతి సారి జలయజ్ఞం అంటున్న చంద్రబాబు విపరీతంగా ధరల పెంపు ద్వారా ముడుపులు పుచ్చుకున్నారని బుగ్గన ఆరోపించారు. జివో 22 మీద 2012 నుంచి కట్టడంలో ఉన్న ప్రాజెక్టులకు ఎంత చెల్లించారో చర్చించేందుకు సిద్ధమా అని బుగ్గన సవాల్ విసిరారు. జలయజ్ఞంలో భాగంగా వైఎస్‌ఆర్ చేపట్టిన పోలవరం కాలువలు, హంద్రీ-నీవా తదితర ప్రాజెక్టులను తప్పు బట్టిన వారే జివో 22 ద్వారా నీళ్లను భోం చేస్తున్నారని బుగ్గన ధ్వజమెత్తారు. పోలవరం భూసేకరణలో మూడో వంతు పూర్తయితే మిగతా చోట్ల తమ వాళ్లచేత భూములు కొనిపించి అదే భూమిని ఎక్కువ ధరకు ప్రభుత్వం కొనుగోలు చేసిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
వైకాపా జాతీయ కార్యదర్శిగా విజయసాయిరెడ్డి
వైకాపా సీనియర్ నేత, రాజ్యసభసభ్యుడు, వేణుంబాక విజయసాయి రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు వైకాపా అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటనలో తెలిపారు.