ఆంధ్రప్రదేశ్‌

అర్బన్ బ్యాంక్‌లపై ఐటి పోటు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, అక్టోబర్ 22: కేంద్ర ప్రభుత్వ అస్తవ్యస్త ఆర్థిక విధానాలు దేశంలో సహకార రంగంలోని అర్బన్ బ్యాంక్‌ల మనుగడకే సవాళ్లు విసురుతున్నాయి. అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటున్న సహకార బ్యాంక్‌లను ఏదోవిధంగా దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉంటున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో చిరు వ్యాపారి నిత్యం ప్రైవేట్ వ్యక్తుల నుంచి ఉదయానే్న రూ.90లు తీసుకుని రాత్రి సమయానికి రూ.100లు చెల్లించే పరిస్థితి నెలకొంది. ఇలాంటి స్థితిలో రాష్టవ్య్రాప్తంగా ఉన్న దాదాపు 50 అర్బన్ బ్యాంక్‌ల మేనేజర్లు దాదాపు తాకట్టు లేకుండానే చిరు వ్యాపారుల స్థితిగతులను గుర్తిస్తూ రుణాలు ఇస్తున్నారు. ఈ బ్యాంక్‌లపై ఎంతో నమ్మకంతో ప్రజల నుంచి డిపాజిట్లు కూడా బాగానే వస్తున్నాయి. డిపాజిట్‌దారులకు వచ్చే లాభంలో డివిడెండ్ రూపంలో చెల్లింపులు జరుగుతుంటే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం 2005 సంవత్సరం నుంచి సహకార అర్బన్ బ్యాంక్‌లకు ఆదాయపు పన్ను చట్టాన్ని వర్తింపచేసింది. దీనివల్ల డివిడెండ్లు గణనీయంగా పడిపోతుంటే ఇదే స్థాయిలో డిపాజిట్లు కూడా తగ్గిపోతున్నాయి. వాస్తవానికి దేశంలో ఆదాయపు పన్ను చట్టం 1922లో అమల్లోకి వచ్చింది. ఇక ప్రస్తుతం అమల్లో ఉన్న ఆదాయపు పన్ను చట్టం 1961 నుంచి అమల్లో వుంది. ఇలా నాటి నుంచి ఈ చట్టాల్లో ఎన్ని మార్పు చేర్పులు జరిగినా సహకార సంస్థలను మాత్రం పన్ను పరిధిలోకి తీసుకురాలేదు. సహకార సంఘాలు వ్యాపార సంస్థలు కావని, ఇవి ఆయా వర్గాల ప్రజలు తమ అవసరాల కోసం ఏర్పాటుచేసుకున్న సచ్ఛంద సంస్థలని నాటి బ్రిటీష్ పాలకుల నుంచి జాతీయోద్యమ నాయకత్వం వరకు భావించి ప్రోత్సహిస్తూ వచ్చారు. వాటి మిగులును లాభాలుగా కాకుండా సభ్యుల ఉమ్మడి ఆదాయంగా పరిగణించేవారు. అందుకే వీటిని ఆదాయపు పన్ను పరిధిలోకి తీసుకురాకుండా ఈ చట్టంలో 80పి అనే నిబంధనను చేర్చారు. ఫలితంగా సహకార సంస్థల మిగులు నిధులు సభ్యులకు రాయితీలు, మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు, తమ కార్యకలాపాల నిర్వహణకు అవసరమైన వౌళిక సదుపాయాల కల్పనకు ఉపయోగించుకునేవారు.
దేశవ్యాప్తంగా ఆరు లక్షల సహకార బ్యాంకులను వ్యాపార, వాణిజ్య సంస్థలుగా గుర్తించకున్నా వాటికి 80పి మినహాయింపు వర్తించదని నాటి ఆర్థిక మంత్రి 2005-06లో ఆర్థిక బిల్లు ద్వారా పార్లమెంట్‌కు ప్రతిపాదించారు. దీనిపై నాడు పెద్దఎత్తున నిరసన పెల్లుబుకింది. అన్ని పక్షాలకు చెందిన వంద మంది ఎంపీలు వ్యతిరేకించారు. అయినా ప్రభుత్వం తన వైఖరి మార్చుకోలేదు. ఫలితంగా ఈ బ్యాంక్‌లు తమ మిగులు ఆదాయం నుంచి 30 శాతం ఆదాయపు పన్నుగా, ఆ పన్ను మొత్తంపై 10 శాతం సర్‌చార్జ్‌గా, మరో 3 శాతం విలువ సెస్‌గా, ఇలా నికర ఆదాయం నుంచి 33.9 శాతం ప్రభుత్వ ఖజానాకు చెల్లిస్తున్నాయి. ఆదాయంలో ఇంత మొత్తం పోతుంటే ఇక సభ్యులకు ఏమేర డివిడెండ్ రూపంలో చేతికి వస్తుందని అర్బన్ బ్యాంకుల నిర్వాహకులు వాపోతున్నారు.
నేటి ప్రధాని నరేంద్ర మోదీ నాడు సహకార బ్యాంకులపై ఆదాయ పన్ను విధింపును నిరసిస్తూ తాము అధికారంలోకి వస్తే దీన్ని తొలగిస్తామని హామీలు గుప్పించారు. తమ ఎన్నికల ప్రణాళికలోనూ ఈ హామీని చేర్చారు. మోదీ అధికారంలోకి రాగానే ఈ అంశంపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని లక్షలాది మంది సభ్యులు ఎదురుచూశారు. తీరా వారికి నిరాశే ఎదురైంది. కార్పొరేట్ కంపెనీలపై ఉన్న ఐటీని 25 శాతం నుంచి 20కి తగ్గిస్తూ అర్బన్ బ్యాంక్‌లపై మాత్రం ఆయన మరింత భారం మోపారు. పైగా సహకార బ్యాంకుల సభ్యులు తమ డిపాజిట్లపై చెల్లించే వడ్డీపై మూలధనం నుంచే మినహాయించేందుకు ‘టిడిఎస్’ ఉన్నా మినహాయింపును కూడా ఎత్తివేసి పన్నుల భారాన్ని మోపారు. దీనివల్ల డిపాజిటర్లకు బ్యాంకులు చెల్లించే వడ్డీ 10 వేల రూపాయలు దాటితే పన్ను మినహాయించి ప్రభుత్వానికి చెల్లించాలనే నిబంధన 20 ఏళ్ల నాటిదైనా ఆ 10 వేల రూపాయల పరిమితిని నేటికీ మార్చలేదు. ఉదాహరణకు రాష్ట్రంలో విశాఖ అర్బన్ బ్యాంక్ ఒకటే ఏటా ఆదాయపు పన్ను కింద కేంద్రానికి రూ.13 కోట్లు చెల్లిస్తోందంటే షేర్ హోల్డర్లకు ప్రయోజనం ఏపాటిదో పాలకులే ఆలోచించాలి.