ఆంధ్రప్రదేశ్‌

ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడి హత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీలేరు, అక్టోబర్ 22: ఆంధ్రా-ఒడిశా సరిహద్దులో మావోయిస్టులు పేట్రేగిపోయారు. ఇన్‌ఫార్మర్ నెపంతో గిరిజనుడిని పట్టపగలే హతమార్చిన సంఘటన వెలుగు చూసింది. ఒడిశా మల్కన్‌గిరి జిల్లా, చిత్రకొండ స్పిల్వే లాంచ్‌ఘాట్ వద్ద బోటులో ఆపరేటర్‌గా విధులు నిర్వహించే పాంగి సోమ అనే గిరిజనుడిని ఆదివారం ఉదయం సాయుధులైన ఐదుగురు మావోయిస్టులు తుపాకీతో కాల్చిచంపారు. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మార్చుకోలేదంటూ ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. పట్టపగలే ఈ ఘటన చోటుచేసుకోవడంతో చిత్రకొండ వాసులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సంఘటన అనంతరం మావోయిస్టులు లాంచ్‌ఘాట్ వద్ద ఉన్న మోటార్ బోటులో వెళ్ళిపోయినట్టు సమాచారం. పాంగి సోమ ఒడిశాలోని జంత్రీ గ్రామానికి చెందివాడు. సోమ గతంలో చిత్రకొండ నుండి జంత్రీకి పోలీసుల నిత్యావసర సరుకులను మోటార్ బోటులో తరలించేవాడు. ఈ నెపంతోనే మావోయిస్టులు సోమ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహరిస్తున్నాడంటూ అనేకసార్లు గ్రామాన్ని విడిచిపోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ సోమ కుటుంబ పోషణ నిమిత్తం ఈప్రాంతంలో నివాసం ఉంటూ జీవనోపాధి సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు సోమను హత్య చేశారు.