ఆంధ్రప్రదేశ్‌

గెలుపు గుర్రాలకే టికెట్లు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కడప, అక్టోబర్ 22 : 2019 ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ప్రతిపక్ష నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కంచుకోట అయిన కడప జిల్లాలో గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తోంది. అధికార టిడిపి అధిష్ఠానం జిల్లాలో గత కొంతకాలంగా చేపట్టిన సర్వేల్లో ప్రస్తుతం ఉన్న నేతల పనితీరుకు బి గ్రేడ్ వచ్చింది. ఈ పరిస్థితుల్లో రెడ్డి, బలిజ సామాజిక వర్గాల నుంచి నాయకులను ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థులు ఆయా నియోజకవర్గాల వ్యక్తులు కాకపోయినా ఆ నేతలకు ఆయా నియోజకవర్గాల్లో బాగా పరిచయం ఉండి రాజకీయంగా అనుభవం కలిగిన వారిని బరిలోకి దింపనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కడప విషయానికొస్తే మైనార్టీల్లో బలమైన నేతలు ఇద్దరు ముగ్గురు పేర్లు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. వారిలో మాజీ మంత్రి డాక్టర్ ఎస్‌ఎ ఖలీల్‌బాషా, టిడిపిలోకి వచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్న మాజీ మంత్రి ఎస్‌ఎండి అహ్మదుల్లా ఉన్నారు. ఇక ప్రొద్దుటూరు నియోజకవర్గంలో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్‌నాయుడు, రాయచోటి నియోజకవర్గంలో వైకాపా నుంచి టిడిపిలోకి రంగప్రవేశం చేయనున్న మాజీ ఎమ్మెల్యే జి.ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్‌కుమార్‌రెడ్డి, రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గంలో కోడూరుకు చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయులు, సిట్టింగ్ ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జునరెడ్డి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. టిడిపి జిల్లా అధ్యక్షుడు ఆర్.శ్రీనివాసరెడ్డి కడప పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగితే ఒక కుటుంబంలో ఒకరికే టికెట్ అనే నినాదంతో రాయచోటిపై పలువురు నేతలు ఆశలు పెట్టుకున్నారు.
రాజంపేట పార్లమెంట్‌లో కేంద్రమాజీ మంత్రి ఎ.సాయిప్రతాప్ టిడిపిలో కొనసాగుతున్నా 4 సార్లు ఎమ్మెల్యేగా ఒక పర్యాయం ఎంపిగా పనిచేసిన ఎస్.పాలకొండ్రాయుడు పేరు కూడా తెరపైకి వచ్చింది. ఇక రైల్వేకోడూరు, బద్వేలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వుడు అయినందున ఆయా నియోజకవర్గాల్లో కూడా కొత్తముఖాలు తెరపైకి వచ్చినా ఆశ్చర్యం లేదు. ఇక మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వస్తే ఇన్‌చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు టిటిడి బోర్డు చైర్మన్ పదవి దక్కితే అక్కడ మాజీమంత్రి, కాంగ్రెస్ నేత డా. డిఎల్ రవీంద్రారెడ్డికి టికెట్ లభించే అవకాశాలున్నాయి. జమ్మలమడుగు విషయంలో ప్రస్తుత మంత్రి సి.ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిలతో చర్చించిన తర్వాత ఏకాభిప్రాయంతో ఒకరు బరిలోకి దిగే అవకాశాలున్నాయి. పులివెందుల నుంచి శాసనమండలి మాజీ డిప్యుటీ చైర్మన్ ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి బరిలో వుంటారని జిల్లా నాయకత్వమే చెబుతోంది. కమలాపురం విషయంలో మాజీ ఎమ్మెల్యే జి.వీరశివారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిల మధ్య నున్వా నేనా అని పోరు నడుస్తోంది.
ముఖ్యంగా బలిజ సామాజిక వర్గం ఈమారు పార్టీ టికెట్లపై పోరుకు దిగే అవకాశాలు కన్పించడంతో పాటు కాపు ఉద్యమాన్ని అణచివేయాలంటే తూ.చ తప్పక జిల్లాలో ఒక ఎంపి, ఒక ఎమ్మెల్యే స్థానం కానీ, రెండు ఎమ్మెల్యే స్థానాలు కానీ ఇవ్వకతప్పదు. ఇదిలా ఉండగా సిఎం చంద్రబాబు ఈ నెలలో రెండు నియోజకవర్గాల్లో పర్యటించాల్సి వుండగా ఆ పర్యటనలు తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. నవంబర్‌లో జిల్లాలో రెండు మూడు రోజుల పర్యటనకు రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నవంబర్‌లో ప్రతిపక్షనేత జగన్ పాదయాత్ర సమయంలో సిఎం పర్యటన జిల్లాలో మొదలుపెడితే ఒకరిద్దరు వైకాపా ఎమ్మెల్యేలను, బలమైన నాయకులను పార్టీలోకి రప్పించుకుని జిల్లాలో బలపడాలని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.