ఆంధ్రప్రదేశ్‌

2019లో రాహులే ప్రధాని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం, అక్టోబర్ 22 : 2019 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలో కాంగ్రెస్‌పార్టీ హవా కొనసాగుతుందని, తద్వారా రాహుల్‌గాంధీ ప్రధానమంత్రి అవుతారని ఏపిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి జోస్యం చెప్పారు. టిడిపి, బిజెపి పాలనలపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని, ఏపిలో సిఎం చంద్రబాబు, కేంద్రంలో ప్రధాని మోదీ గ్రాఫ్ పడిపోతుందని వ్యాఖ్యానించారు. రఘువీరా ఆదివారం అనంతపురం నగరంలోని మడకశిర భవన్‌లో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. సిఎం చంద్రబాబు కేవలం ప్రజా సమస్యల నుంచి తప్పించుకునేందుకే రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే పేరుతో విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రానికి పరిశ్రమలు వస్తాయని, అయితే ప్రత్యేక హోదా విషయంలో బిజెపి, టిడిపి ప్రభుత్వాలు మాట తప్పాయన్నారు. ఇప్పటి వరకూ చంద్రబాబు సుమారు 10 సార్లు విదేశాలకు వెళ్లారని, ఆయన చంద్ర మండలానికి వెళ్లినా రూపాయి కూడా రాదని ఎద్దేవా చేశారు. విశాఖపట్నంలో నిర్వహించిన సదస్సులో రూ. 11 లక్షల కోట్లకు ఎంఓయూలు కుదుర్చుకున్నామని, పరిశ్రమలు వచ్చేస్తున్నాయని ప్రగల్భాలు పలికారని, అయితే ఇప్పటి వరకూ రూ. 1000 కోట్లు కూడా రాలేదని, కనీసం 1000 మందికి కూడా ఉపాధి, ఉద్యోగావకాశాలు దక్కలేదన్నారు. దీపావళి రోజున కూడా రాష్ట్రం కోసం విదేశాలకు వెళ్లానని, తన మనవడితో ఆడుకోలేకపోయాయని సిఎం చంద్రబాబు చెప్పడాన్ని ప్రస్తావిస్తూ ‘తన మనవడిని వదిలి విదేశాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.. ఈ వయసులో అంత కష్టపడాల్సిన పని లేదు.. ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర ఉంది.. అంతవరకూ మనవడితో హాయిగా ఆడుకోండి..’ అంటూ ఎద్దేవా చేశారు. ఇక తెలంగాణ టిడిపి నేత రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిఎం చంద్రబాబే వివరణ ఇవ్వాలని విలేఖరుల అడిగిన ప్రశ్నకు రఘువీరా సమాధానం చెప్పారు. క్యాబినెట్ మంత్రులపైనే రేవంత్‌రెడ్డి ఆరోపణలు చేశారంటే జాతీయ అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబుపై చేసినట్లేనని అభిప్రాయపడ్డారు. అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పయ్యావులకేశవ్, మంత్రి పరిటాల సునీత తదితరులకు లిక్కర్ యూనిట్లు మంజూరు చేశారన్న విషయంపై, తెలంగాణలో ఆంధ్ర టిడిపి నేతలకు కాంట్రాక్టు ఇచ్చిన విషయాలపై చంద్రబాబే సమాధానం చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న విషయాలు ఏఐసిసి, తెలంగాణ రాష్ట్రానికే పరిమితమని, అందులో తమ ప్రమేయం ఉండదని వ్యాఖ్యానించారు. తాను అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని, పార్టీ అధిష్ఠానం టికెట్ కేటాయిస్తే అసెంబ్లీకి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో ఉంటానన్నారు.

చిత్రం.. విలేఖరులతో మాట్లాడుతున్న ఏపిసిసి చీఫ్ ఎన్.రఘువీరారెడ్డి