ఆంధ్రప్రదేశ్‌

అటవీ శాఖ సిబ్బందిపై వేటగాళ్ల కాల్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, అక్టోబర్ 22: వన్యప్రాణులును వేటాడటానికి వచ్చిన వేటగాడు అటవీ శాఖ సిబ్బంది నుండి తప్పించుకునే ప్రయత్నంలో జరిపిన కాల్పుల్లో ఒక యువకుడు మృతి aచెందాడు. అటవీ శాఖ గార్డుకు సహాయకునిగా వెళ్లిన ఆ యువకుడి జీవితం అర్థాంతరంగా ముగిసింది. తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతం దేవీపట్నం మండలంలోని నాగళ్లపల్లి వద్ద ఆదివారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలావున్నాయి... పి వరలక్ష్మి అనే ఫారెస్టు గార్డు ఆదివారం విధినిర్వహణ నిమిత్తం దండంగి సౌత్ బీట్ ప్రాంతానికి వెళ్లారు. ఆమె తన వెంట దండంగి గ్రామానికి చెందిన పత్తి పోశురత్నం (21) అనే యువకుడిని సహాయకునిగా తీసుకువెళ్లారు. అటవీ ప్రాంతంలో వారికి నాటు తుపాకులతో వన్యప్రాణులను వేటాడటానికి వచ్చిన పదిమంది వేటగాళ్లు కనిపించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ఎనిమిది మంది పారిపోయారు. మిగిలిన ఇద్దరిని వారు వెంటాడుతున్న తరుణంలో హఠాత్తుగా వారిలో ఒక వేటగాడు తనవద్ద ఉన్న నాటు తుపాకీతో కాల్పులు జరిపి, పరారయ్యాడు. ఈ కాల్పుల్లో సహాయకునిగా వెళ్లిన పోశురత్నం తీవ్రంగా గాయపడ్డాడు. అతడిని చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అక్కడ మృతిచెందాడు. దేవీపట్నం పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదుచేశారు.

చిత్రం..గాయపడిన పోశురత్నంను ఆసుపత్రికి తరలించిన దృశ్యం