కృష్ణ

ఒకరికి బదులు మరొకరు పరీక్ష రాస్తూ దొరికిపోయారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), మే 28: ఒకరి స్థానంలో మరొకరు ఇంటర్ పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడు. పరీక్ష రాసే వ్యక్తితోపాటు, రాయాల్సిన విద్యార్థిపై కూడా పోలీసులు కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రసాదంపాడు పురుషోత్తనగర్‌కు చెందిన అనిశెట్టి భుజంగనాయుడు మారుతీనగర్‌లోని శ్రీవిద్య ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్‌లో జూనియర్ ఇంటర్ చదువుతూ ఇటీవల పరీక్షలు రాశాడు. కాగా అడ్వాన్స్‌డ్ సప్లమెంటరీ పరీక్షలు రాసేందుకు సిద్ధమైన క్రమంలో బెంజిసర్కిల్ సమీపంలోని నారా చంద్రబాబునాయుడు కాలనీలోని నారాయణ కాలేజీ సెంటర్ పడింది. ఈక్రమంలో శనివారం ఎకనామిక్స్ పరీక్షకు హాజరై రాయాల్సి ఉండగా.. ఇతనికి బదులుగా పైపులరోడ్డుకు చెందిన సాయినీడి కుమారస్వామి అనే వ్యక్తి హాజరయ్యాడు. హాల్ టిక్కెట్‌పై భుజంగనాయుడు ఫొటో ఉంది. కాని పరీక్ష రాస్తోంది కుమారస్వామి కావడంతో అనుమానం వచ్చిన ఇన్విజిలేటర్ అతన్ని ప్రశ్నించగా ఫొటో తాను పదో తరగతిలో ఉన్న ఫొటో అని సమాధానం ఇవ్వడంతో అనుమానం కలిగి విచారించగా అసలు విషయం వెల్లడైంది. దీంతో ఈ విషయాన్ని ఇన్విజిలేటర్ కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లారు. సిద్ధార్థ మహిళా కళాశాల అధ్యాపకురాలైన గుడివాడ అరుణశ్రీ పరీక్షలకు కో ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆమె పరీక్ష రాస్తున్న నకిలీ విద్యార్థి సాయినీడి కుమారస్వామిని పోలీసులకు అప్పగించారు. సదరు అధ్యాపకురాలు ఫిర్యాదు మేరకు కుమారస్వామితోపాటు, పరీక్ష రాయాల్సిన విద్యార్థి భుజంగనాయుడుపై కూడా కేసు నమోదు చేసిన పటమట పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

న్యాయ వ్యవస్థపై అపార నమ్మకం

బెంజిసర్కిల్, మే 28: దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతూ, న్యాయ వ్యవస్థలో వాదోపవాదనలు జరుగుతున్న సమయంలో సహార సంస్థ తన ఇనె్వస్టర్స్‌కు భరోసాను ఇచ్చేందుకు గాను వాస్తవ పరిస్థితులను వివరించింది. కొనే్నళ్లుగా ఇటు సహారా ఉద్యోగులకు గాని సహారాలో పెట్టుబడులు పెట్టిన వారి సందేహాలను నివృత్తి చేసేందుకు గాను సహార సంస్థ నగరంలో ఒక ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది. నగరంలోని బందరురోడ్డులో ఉన్న గేట్‌వే హోటల్‌లో శనివారం నిర్వహించిన ఈసమావేశంలో సంస్థ వారి పరిస్థితులను వివరించింది. భారత న్యాయ వ్యవస్థపై మాకు అపారమైన విశ్వాసం ఉందని, సంస్థ ప్రారంభం నుంచి న్యాయబద్ధంగానే కార్యకలాపాలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. అయితే ఇదే సమయంలో వివిధ కారణాల వలన కొన్ని సందర్భాల్లో న్యాయం జరగడం అలస్యం జరిగి ఉండవచ్చన్నారు. ఇప్పడు అందరి మదిలో ఉన్న ఒకటే ప్రశ్న సహారా న్యాయ విరుద్ధంగా నిధుల్ని ఎందుకు సేకరించిందని అందరూ అడుగుతున్నారని అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం న్యాయ స్థానం పరిధిలో ఉన్నందున దీనిపై వ్యాఖ్యానించలేమన్నారు. ఆరోపణ మాత్రం తప్పని మాత్రం చెప్పగలం.. నిరూపిస్తామన్నారు. అన్ని వ్యవహారాలకు సంబంధించి రిటర్న్స్‌ను పూర్తిగా సమర్పిస్తున్నట్లు సహారా చైర్మన్ సహారా సుబ్రతరాయ్ చెప్పారు. ఇదే సమయంలోఓఎఫ్‌సిడిల ద్వారా నిధులను సేకరించవచ్చని రిజిష్ట్రార్ ఆఫ్ కంపెనీస్ నుంచి పూర్తి అనుమతులు పొందినట్లు చెప్పారు. ఇవి అత్యంత ముఖ్యమైన ప్రభుత్వ శాఖలలో ఒక్కటన్నారు. అలాగే నిబంధనల్ని అనుసరించి మా బ్యాలెస్స్ షీట్స్ మరియు రిటర్న్స్‌ను రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీకి ఎప్పడూ ఫైల్ చేస్తున్నట్లు తెలిపారు. ఇదే క్రమంలో వారు ఎప్పటికప్పడు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. వ్యవహారం జరుగుతున్న సమయంలో సహారాది ఒప్పని, సెబిది తప్పని అప్పటి న్యాయశాఖ మంత్రితో పాటు పలువురు ప్రముఖులు ప్రకటించిన సంఘటనలను ప్రస్తావించారు. వాస్తవాలు మా పక్షాన ఉన్నప్పటికీ ఇనె్వస్టర్లను తప్పదారి పట్టించే విధంగా కొన్ని సంస్థలు వ్యవహరిస్తున్నట్లు చెప్పారు. కొన్ని నెలలుగా దేశ వ్యాప్తంగా పలు వార్తాపత్రికల్లో ప్రకటనలు వెలువరించిన తర్వాత సెబి ఆధ్వర్యంలో చెల్లింపులు జరిగినట్లు తెలిపారు. 50కోట్ల రూపాయలు మాత్రమే తిరిగి చెల్లించామన్నారు. తిరిగి చెల్లింపుల మొత్తం సుమారు రూ.100 కోట్లను సెబి వద్ద రూ.14 వేల కోట్ల మేర మించి ఉంచినట్లు చెప్పారు. అలాగే సహారా వారి సుమారు 20 వేల కోట్ల రూపాయల విలువైన భూములు, అస్తులకు సంబంధించిన ఒరిజినల్ పత్రాలు కూడా సెబి అధీనంలో ఉన్నట్లు చెప్పారు. 3కోట్ల మంది ఖాతాదారులకు తిరిగి చెల్లింపులు చేసినట్లు తెలిపారు. ఇక ఈ రెండు కంపెనీల విషయంలో సహారా సుబ్రతా రాయ్ పాత్రపై వస్తున్న విమర్శలకు సమాధానంగా సుప్రీం కోర్టు నుండి ప్రతికూల తీర్పును అందుకున్న రెండు కంపెనీలకు ఆయన కేవలం వాటాదారు మాత్రమేనన్నారు. అయితే ఆయనను ప్రమోటర్ షేర్ హోల్డర్‌గా కస్టడీలోని తీసుకోవడం జరిగిందన్నారు. కంపెనీ చేసిన పొరపాట్లకు వాటాదారుడు నిర్బంధానికి గురికావలసిన పని లేదన్నారు. ఇక సహారా గ్రూప్ మొత్తంగా సెబీ అధినంలో ఉన్నందున నిధులు సేకరించిన ఆస్తిని తాకట్టు పెట్టినా అవి సెబి - సహారా ఖాతాకు వెళ్లిపోతుందన్నారు. దీని కారణంగానే ఒక్కరూపాయిని కూడా సేకరించడం లేదన్నారు.

అరకులోయ వద్ద రోడ్డు ప్రమాదం
ఇంజనీరింగ్ విద్యార్థి మృతి

అరకులోయ, మే 28: విశాఖ జిల్లా అరకులోయ పోలీస్ స్టేషన్ సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంజనీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. సుంకరమెట్ట-గనె్నల కూడలి వద్ద అరకులోయ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న స్కార్పియో విశాఖపట్నం నుంచి ద్విచక్ర వాహనంపై అరకులోయకు వస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ విద్యార్థి అక్కడికక్కడే మృతిచెందాడు. విజయవాడ సిద్ధార్థ కళాశాలలో ఐటి విభాగంలో రెండో సంవత్సరం చదువుతున్న ఎం.సాయితరుణ్ (21) తోటి విద్యార్థులతో కలిసి ప్రాక్టికల్స్ కోసం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌కు వచ్చాడు. అక్కడ ప్రాక్టికల్స్ పూర్తిచేసి అరకులోయ సందర్శనకు తోటి విద్యార్థులతో కలసి వస్తున్నాడు. అనుకోని రీతిలో మృత్యువాత పడ్డాడు. సమాచారం అందుకున్న స్థానిక పోలీస్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సింహాద్రినాయుడు, సబ్ ఇన్‌స్పెక్టర్ పైలా సింహాచలం ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. సంఘటనపై కేసు నమోదు చేసి ఇంజనీరింగ్ విద్యార్థి మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

నగర మేయర్‌గా కాపు కులస్థుడిని నియమించాలి

విజయవాడ, మే 28: రాజధాని ప్రాధాన్యత దృష్ట్యా విజయవాడ నగర మేయర్‌గా కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కోరనున్నామని కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పిళ్లా వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు బేతు రామ్మోహన్‌రావు తెలిపారు. కాపునాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కాపుల సంక్షేమానికి విద్యార్థులకు, యువకులకు, పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు తలపెట్టినందుకు దానిలో భాగంగానే కాపు రుణాలకు వయో పరిమితి 21 సం. నుండి 45 సం. వరకు రాష్ట్ర కాపునాడు కోరిక మేరకు వయో పరిమితిని 18 నుండి 50 సం.లకు పెంచినందుకు కాపునాడు ధన్యవాదాలు తెలుపుతున్నదన్నారు. ప్రతి నిరుద్యోగ కాపు యువతకు కాపు రుణము రూ.2,00,000లకు తక్కువ కాకుండా సహకార బ్యాంకులు, గ్రామీణ బ్యాంకుల ద్వారా తక్షణమే మంజూరు చేయాలని కాపునాడు విజ్ఞప్తి చేస్తోందన్నారు. సమావేశంలో కృష్ణాజిల్లా కాపునాడు నాయకులు కూనపరెడ్డి రమేష్‌బాబు, విజయవాడ నగర వర్కింగ్ ప్రెసిడెంట్ విక్రమ్ నాగు, విజయవాడ నగర ఉపాధ్యక్షుడు పుప్పాల రవికుమార్, తాడేపల్లి పట్టణ కాపునాడు అధ్యక్షుడు పెండ్యాల వెంకటరమణ, విజయవాడ నగర కార్యదర్శి లంకా రాంబాబు, గుంటూరు జిల్లా కాపునాడు ప్రధాన కార్యదర్శి వేరుకొండ వెంకటరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు.