ఆంధ్రప్రదేశ్‌

ఇంతకంటే ఘనులు లేరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 30: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిప్పులు చెరిగారు. ‘‘ఆర్థిక నేరాల్లో ఎ1 ముద్దాయిగా ఉన్న జగన్ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అందులో ఎ2 ముద్దాయిగా ఉన్న విజయసాయిరెడ్డికి ఇప్పుడు రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు. ఇది గర్హనీయం’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆ పార్టీకి ఎ1,ఎ2 ముద్దాయిలు తప్ప, వేరే నాయకులు లేరా? అని చంద్రబాబు ప్రశ్నించారు. సోమవారం రాత్రి తన నివాసంలో జరిగిన విలేఖరుల సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ వైకాపా నాయకులు రాష్ట్ర ప్రయోజనాలను దారుణంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. నేర, దుర్మార్గపు రాజకీయాలు చేసే వారు చట్ట సభలకు వెళ్లడం వలన ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమవుతాయో ప్రజలే ఆలోచించుకోవాలని చంద్రబాబు అన్నారు. వైకాపా, కాంగ్రెస్ పార్టీలు కుల రాజకీయాలను రెచ్చగొడుతున్నాయని ఆయన అన్నారు.
ప్రైవేటు బిల్లుకు మద్దతు ఎందుకు?
చేసిందంతా చేసి, ఇప్పుడు పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు పెట్టాలని కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలను చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. ‘‘నాడు విభజన కోసం వార్ రూంలో సమావేశాలు ఏర్పాటు చేశారు. యుద్ధ విమానంలో బిల్లును తీసుకువచ్చారు. పార్లమెంట్ తలుపులు మూసేసి, టెలివిజన్ ప్రసారాలను నిలిపివేసి రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారని అన్నారు. అప్పుడు ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపిలు ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ ఇంత దుస్థితిలో ఉండడానికి కారణం కాంగ్రెస్ కాదా? అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజానీకం ఇన్ని కష్టాలు అనుభవించడానికి కాంగ్రెస్ పార్టీది బాధ్యత కాదా? అని ఆయన ప్రశ్నించారు. విభజన తరువాత జైల్లో ఉన్న జగన్‌ను ఆగమేఘాల మీద విడుదల చేయించి, కాంగ్రెస్ పార్టీ దిక్కుమాలిన రాజకీయాలు చేసిందని ఆయన అన్నారు. భవిష్యత్‌లో రాష్ట్ర ప్రజలు పడే అన్ని కష్టాలకు కాంగ్రెస్, వైకాపాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రాష్ట్రానికి అన్యాయం చేసిన కాంగ్రెస్, వైకాపాలు తనను విమర్శించడానికి అర్హత లేదని అన్నారు.
2050 వరకూ అవకాశం ఇవ్వండి!
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి 2050 సంవత్సరం వరకు టిడిపికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు నాయుడు ప్రజలను కోరారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరచుకుంటూ ప్రగతి పథంలో ముందుకు సాగుతున్నామని ఆయన చెప్పారు. జూన్ 2వ తేదీన నవనిర్మాణ దీక్ష చేపడతామని, ఆ రోజు ఉదయం 11 గంటలకు రాష్ట్ర ప్రజలంతా ఎక్కడికక్కడ ప్రతిజ్ఞ చేయాల్సి ఉందని అన్నారు. అలాగే ఏడో తేదీ వరకూ ఒక్కో శాఖ గురించి జనం మధ్య సమీక్ష జరపుతామన్నారు. తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎనిమిదవ తేదీన మహా సంకల్పదీక్ష చేపడతామని, అందులో మొదటి, రెండో సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, జరిగిన అభివృద్ధి గురించి ప్రజలకు తెలియచేస్తామని ఆయన చెప్పారు.