ఆంధ్రప్రదేశ్‌

దేశంలో 1.8 కోట్ల ఇళ్ల కొరత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 30: దేశంలో ఇప్పటికీ 1.8 కోట్ల ఇళ్ల కొతర ఉందని కేంద్ర పట్టణ గృహనిర్మాణ శాఖ సంయుక్త కార్యదర్శి, హౌసింగ్ ఫర్ ఆల్ మేనేజింగ్ డైరెక్టర్ అమ్రి అభిజిత్ అన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమం దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడుతూ అల్పాదాయ వర్గాల సొంతింటి కలను నెరవేర్చేందుకే ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణ, తమిళనాడు, కర్నాటక, కేరళ, పాండిచ్చేరి రాష్ట్రాల మున్సిపల్ అధికారులు, గృహనిర్మాణ సంస్థల అధికారులతో సోమవారం విశాఖలో నిర్వహించిన రెండు రోజుల వర్క్‌షాప్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అభిజిత్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న అల్పాదాయ, ఇళ్లులేని వారికోసం 2022 నాటికి రెండు కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్టు వెల్లడించారు. ఇళ్లు లేనివారికి సొంతింటి కలను నిజం చేయడంతో పాటు ఇప్పటికే సొంత ఇల్లు ఉండి, పూర్తి స్థాయిలో నిర్మించుకోలేని అర్హులకు సైతం ఈ పథకంలో అవకాశం కల్పించనున్నట్టు వెల్లడించారు. అందరికీ ఇళ్లు పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం విశేష ప్రాధాన్యతనిస్తోందన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక సహకారం, లబ్దిదారు వాటాతో పాటా బ్యాంకుల ద్వారా రుణ సదుపాయాన్ని కల్పించి, కనీస వసతులతో కూడిన ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నట్టు వెల్లడించారు. పథకంలో అర్హులైన లబ్ధిదారుల ఎంపికలో పూర్తి పారదర్శకత పాటించేలా నిబంధనలు రూపొందించామన్నారు. అలాగే ఇళ్ల నిర్మాణంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకునేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. బ్యాంకులతో కలిసి ఈ పథకాన్ని అమలు చేసే క్రమంలో అధికారులకు ఇటువంటి వర్క్‌షాప్ ఉపకరిస్తుందని అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహాయ కార్యదర్శి ఎస్‌సి జెనా మాట్లాడుతూ పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో నివసించే వారికి ప్రత్యామ్నాయంగా అన్ని వసతులతో కూడిన, మెరుగైన ఇళ్లను నిర్మించేందుకు హౌసింగ్ ఫర్ ఆల్ ఎంతో ఉపకరిస్తుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా పట్టణాలు, నగరాల్లో మురికివాడల సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. ఈ సందర్భంగా విశాఖ నగరంలో హౌసింగ్ ఫర్ ఆల్ పథకం ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు యంత్రాంగం తీసుకున్న చర్యలను కేంద్ర ఉన్నతాధికారులు ప్రశంసించారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ ఎం దానకిషోర్, తమిళనాడు పురపాలక శాఖ కమిషనర్ జి ప్రకాష్, తమిళనాడు నగర పంచాయతీల విభాగం డైరెక్టర్ కె మహర్ భూషణం, టిఎంఎస్‌సిబి ప్రతినిధి పళనిస్వామి, విశాఖ కలెక్టర్ ఎన్ యువరాజ్, జివిఎంసి కమిషనర్ ప్రవీణ్‌కుమార్, వుడా వైస్ చైర్మన్ బాబూరావు నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.