ఆంధ్రప్రదేశ్‌

సాగర తీరం... జనసంద్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 12: తూర్పు నౌకాదళం స్వర్ణోత్సవాల్లో భాగంగా ఆదివారం విశాఖ సాగర తీరాన నేవీ మారథాన్‌ను నిర్వహించింది. నాలుగేళ్ళుగా నేవీ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నా, ప్రజల నుంచి అంతంతమాత్రంగానే స్పందన వచ్చింది. కానీ, ఈసారి ఈ మారథాన్‌లో 12 వేల మంది యువకులు, పిల్లలు, పెద్దలు పాల్గొనడం అందరిని ఆశ్చర్యపరచింది. నేవీ అధికారులు కూడా ఊహించని రీతిలో జనం సముద్ర తీరానికి తరలి వచ్చారు. 42.2 కిలో మీటర్ల పరుగును ఫుల్ మారథాన్‌గా, 21.1 కిలో మీటర్ల పరుగును ఆఫ్ మారథాన్‌గా, 10 కిలో మీటర్లు, ఐదు కిలో మీటర్ల రేస్‌లుగా విభజించారు. బీచ్ రోడ్‌లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్ వద్ద నుంచి ఈ మారథాన్ ప్రారంభమైంది. 42.2 కిలో మీటర్ల మారథాన్‌లో 300 మంది పాల్గొన్నారు. ఆదివారం తెల్లవారుజామున 4.15 గంటలకు రేస్ డైరక్టర్ డాక్టర్ మురళి జెండా ఊపి ఫుల్ మారథాన్‌ను ప్రారంభించారు. ఆఫ్ మారథాన్‌లో 2000 మంది పాల్గొన్నారు. దీన్ని ఐఎన్‌ఎస్ కళ్యాణి కమాండింగ్ ఆఫీసర్ జిఆర్ ప్రదాన్ ప్రారంభించారు. 6.15 గంటలకు 10 కిలో మీటర్ల రేస్‌ను వైస్ అడ్మిరల్ అతుల్ కుమార్ జైన్ ప్రారంభించారు. ఈ రేస్‌లో 3,300 మంది పాల్గొన్నారు. చివరిగా ఐదు కిలో మీటర్ల రేస్‌కు 7000 మంది సిద్ధమయ్యారు. ఈ రేస్‌ను తూర్పు నౌకాదళ అధికారి వైస్ అడ్మిరల్ కరంబీర్ సింగ్ ప్రారంభించారు. నీలం బనియన్లు ధరించి, బీచ్ రోడ్డులో జనం పరుగులు తీస్తుంటే, జన కెరటం ఉరకలెత్తిందా అన్న భావన కలిగింది. పిల్లలతోపాటు తల్లిదండ్రులు కూడా ఈ రన్‌లో పాల్గొనడం విశేషం. రన్ కొనసాగిన ప్రాంతాల్లో నేవీ వాలంటీర్లు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. అలాగే, దారిపొడవునా టాయిలెట్స్ ఏర్పాటు చేశారు. ఈ మారథాన్ వలన ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా పోలీసులు తగిన చర్యలు తీసుకున్నారు.
తూర్పు నౌకాదళం నిర్వహించిన కార్యక్రమానికి ఇంత పెద్దఎత్తున ప్రజల నుంచి స్పందన రావడం ఇదే మొదటిసారి. సిటీ ఆఫ్ డెస్టినీగా గుర్తింపు పొందిన విశాఖ నగరంలో ఇంత భారీ ఎత్తున మారథాన్ జరగడం ముదావహం. ఇతర దేశాల నుంచి విశాఖకు వచ్చిన పర్యాటకులు కూడా ఈ మారథాన్‌లో పాల్గొనడం గమనార్హం. మారథాన్ పూర్తయిన తరువాత విజేతలను ప్రకటించారు. ఫుల్ మారథాన్ పురుషుల విభాగంలో విన్నర్‌గా జగదీష్ మునుస్వామి నిలిచారు. రన్నర్‌అప్‌గా డానియల్ లాంగే నిలిచారు. ఫుల్ మారథాన్ మహిళల విభాగంలో ఎన్.నోమల్ విన్నర్‌గాను, మాధురి పల్లి రన్నర్ అప్‌గా నిలించారు. ఆఫ్ మారథాన్‌లో జేమ్స్ విజేతగా నిలిచారు. గోవింద్ సింగ్ రన్నర్ అప్‌గా వచ్చారు. ఆఫ్ మారథాన్ మహిళా విభాగంలో జెడ్‌వై అంబి విన్నర్‌గా నిలిచారు. ఎల్.కలిసేల్వి రన్నర్‌అప్‌గా వచ్చారు. 10 కిలో మీటర్ల రేస్ పురుషుల విభాగంలో అమాన్యూ అబ్దు విజేతగా నిలిచారు. చోడవరపు మహేంద్ర రన్నర్ అప్‌గా నిలిచారు. మహిళా విభాగంలో బొల్ల సాయిలక్ష్మి విజేతగా నిలిచారు. ఎం.వినీత రన్నర్‌అప్‌గా నిలిచారు.

చిత్రం..తూర్పు నౌకాదళ స్వర్ణోత్సవాల్లో భాగంగా విశాఖలో నిర్వహించిన మారథాన్‌కు తరలి వచ్చిన జనం