ఆంధ్రప్రదేశ్‌

ఉనికి కోసమే జగన్ పాదయాత్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిద్దలూరు, నవంబర్ 12: వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర ఆయన ఉనికిని కాపాడుకునేందుకే తప్ప ప్రజా సంక్షేమం కాదని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. ఆదివారం ఆయన ప్రకాశం జిల్లా గిద్దలూరులో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ఏ ప్రాజెక్టు ప్రారంభించాలన్నా జగన్ కోర్టులకు వెళ్ళి అడ్డుపడుతున్నారే తప్పా ప్రతిపక్ష నేతగా వ్యవహరించడం లేదని మండిపడ్డారు. నంద్యాల ఉప ఎన్నిక, కాకినాడ మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో జగన్‌కు ఓటమి భయం పట్టుకుందన్నారు. 2019 ఎన్నికల్లో కూడా టిడిపి విజయఢంకా మోగిస్తుందని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. పక్కాగృహాల నిర్మాణానికి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చిందని, అనేక ప్రాంతాల్లో ఇళ్ళ నిర్మాణం చురుకుగా సాగుతోందని అన్నారు. అర్హులైన పేదలకు రేషన్‌కార్డులు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని అన్నారు. కాపులు మొదట బీసీల్లోనే ఉన్నారని, అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వారిని బిసి జాబితా నుంచి తొలగించిందని అన్నారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో కాపులకు హామీ ఇచ్చారని, ఆ హామీ మేరకు అధ్యయనం చేసేందుకు కమిటీ వేశారని, ఆ కమిటీ నివేదికను డిసెంబర్‌లోగా ఇవ్వాలని ఆదేశించడం జరిగిందన్నారు. 100 కోట్ల రూపాయలతో కాపు కార్పొరేషన్ ఏర్పాటుచేసి వారి ఆర్థిక పరిపుష్టికి కృషి చేయడం జరిగిందన్నారు. రాష్ట్రంలో పోలీసు సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందని, ఇటీవల 6 వేల మందిని నియమించినట్లు వారంతా ప్రస్తుతం శిక్షణలో ఉన్నారని తెలిపారు. త్వరలోనే వారితో అన్ని పోలీసుస్టేషన్లలో ఖాళీలను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.