ఆంధ్రప్రదేశ్‌

అత్యాచార యత్నం... ఆపై హత్యాయత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏలూరు, నవంబర్ 12: ప్రేమ పేరుతో తొమ్మిదో తరగతి విద్యార్థినిని వేధించి, ఆమెపై అత్యాచార యత్నానికి దిగి, తప్పించుకుని పారిపోతుంటే బ్లేడుతో పీకకోసిన కామాంధుడి ఉదంతమిది. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం ఏలూరులో శనివారం రాత్రి చోటుచేసుకున్న ఈ ఘటన ఆదివారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలావున్నాయి... ఏలూరు గన్‌బజార్‌కు చెందిన ఒక విద్యార్ధిని సిఎస్‌ఐ పాఠశాలలో 9వ తరగతిచదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన విజయ్ అనే వ్యక్తి తనను ప్రేమించాలంటూ కొంతకాలంగా వెంటపడి వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని పెద్దలకు చెబితే ఆమె తల్లిదండ్రులపై యాసిడ్ పోస్తానని బెదిరించేవాడు. ఈ నేపధ్యంలో శనివారం రాత్రి ఆ విద్యార్ధిని కిరాణా షాపునకు వెళ్లి ఇంటికి వస్తుండగా విజయ్ మరో ఇద్దరు వ్యక్తుల సాయంతో ఆ విద్యార్ధినిని బలవంతంగా ఒక సందులోకి తీసుకువెళ్లి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ఆ బాలిక తప్పించుకుని, పారిపోతుంటే వెంటపడి బ్లేడుతో పీకకోశాడు. ఈ నేపథ్యంలో విజయ్ వద్ద యాసిడ్ సీసా కూడా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రిలో చేర్చారు. ఈమేరకు విజయ్, అతనికి సహకరించిన ఇద్దరిపై ఏలూరు టుటౌన్ పోలీసులు కేసు నమోదుచేశారు.