ఆంధ్రప్రదేశ్‌

జగన్ ఆర్థిక నేరాలపై దర్యాప్తు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 12: ప్రతిపక్ష నేత జగన్ ఆర్థిక నేరాలపై వివిధ కేంద్ర సంస్థలు దర్యాప్తు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ప్యారడైజ్ పత్రాలపై పాదయాత్రలో ప్రజలకు జగన్ సమాధానం చెప్పాలన్నారు. నగరంలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ పనామా, ప్యారడైజ్, తదితర పత్రాలపై ఆర్బీఐ, సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్, ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ యూనిట్, సీబీఐ వంటి సంస్థలు దర్యాప్తు చేయాల్సి ఉందన్నారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే మరికొన్ని అక్రమాలు వెలుగుచూసే అవకాశం ఉందని భావిస్తున్నామన్నారు. రాజకీయాలను మారుస్తానని చెబుతున్న జగన్ రాజకీయాలను భ్రష్టు పట్టించిన వ్యక్తి అని యనమల ఆరోపించారు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే భవిష్యత్తు తరాలు కూడా తమలానే ఉండాలని భావిస్తున్నారన్న అనుమానం కలుగుతోందని ఎద్దేవా చేశారు. పన్నుల ఎగవేత, క్విడ్‌ప్రోకో ద్వారా వివిధ షెల్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టటం వంటి ఆర్థిక నేరాలకు పాల్పడ్డ వ్యక్తి రాజకీయాలను మారుస్తాననడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. అవినీతిపరుడిని ఆదర్శంగా తీసుకుంటే సమాజం నష్టపోతుందన్నారు. వైఎస్ హయాంలోనే వికీలీక్స్ సమాచారం వచ్చిందని, ఆ తరువాత వివిధ పత్రాలు వెలుగుచూస్తున్నాయని, అవన్నీ నిజాలు అవుతున్నాయన్నారు. ఒక రాజకీయ నేతపై ఇన్ని సంస్థలు దర్యాప్తు చేయడమన్నది ప్రపంచంలో ఒక వింత అని యనమల చెప్పారు. వివిధ రకాలుగా లూటీ చేసి డబ్బు పోగేసినట్లు తెలుస్తోందన్నారు. వివిధ ప్రాంతాల్లో వైఎస్ కుటుంబం ప్యాలెస్‌లు ఎలా నిర్మించిందో ఈనేపథ్యంలో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. అసలు ఇలాంటి నేత రాజకీయాలకు అవసరమా? అని ప్రశ్నించారు. దోచుకున్న ఆస్తులను రక్షించుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకే జగన్ రాజకీయాల్లో కొనసాగుతున్నారని ఆరోపించారు. ప్రపంచంలోని 714 మంది ఆర్థిక నేరగాళ్లలో జగన్ ఒకరు కావడంతో రాష్ట్ర ప్రతిష్ఠ మంటగలుస్తోందన్నారు. జగన్‌పై కొత్తగా మరిన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సీబీఐ కేసులను మళ్లీ దర్యాప్తు చేయాలని మంత్రి యనమల సూచించారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు మాట్లాడుతూ ప్రజలకు ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల జగన్‌పై నమోదు చేసిన కేసుల వివరాలు తెలుసుకోలేక పోతున్నారన్నారు. ఆర్థిక నేరగాళ్లు వివిధ రకాలుగా నేరాలకు పాల్పడుతున్నారని, జగన్ క్విడ్‌ప్రోకో విధానం ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇప్పటికే జగన్ సంస్థలకు చెందిన ఈక్విటీ వివరాలు తప్పుగా వెల్లడించినందుకు కేసు నమోదైందని ఆయన గుర్తు చేశారు.