ఆంధ్రప్రదేశ్‌

ప్రజల మనోభావాలు తాకట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 12: రాష్ట్భ్రావృద్ధికి ప్రత్యేక హోదా సాధించాలనే ఆంధ్రుల మనోభావాలను తమ రాజకీయ స్వప్రయోజనాల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి తాకట్టుపెట్టి బీజేపీకి లొంగిపోయారని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్ రఘువీరారెడ్డి ఆరోపించారు. ఆదివారం ఇక్కడి ఉల్ఫ్‌హాల్ గ్రౌండ్‌లో రాష్ట్ర కాంగ్రెస్ మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కేంతవరకూ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుందని చెప్పారు. తమపై వున్న కేసుల భయంతో చంద్రబాబు, జగన్ మోదీకి తలొగ్గారని ఆరోపించారు. ఎన్డీఏ పాలనలో మైనార్టీలకు రక్షణ కరవైందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ ధనికులు, పారిశ్రామికవేత్తలకు తప్ప సామాన్యుల కోసం చేసిందేమీ లేదని విమర్శించారు. మాజీ ప్రధాని వాజపేయి బీజేపీ నేత అయినప్పటికీ ఆయన పాలనలో అన్ని వర్గాలు సమాన గౌరవం పొందాయని, మోదీ పాలనలో హక్కులను కాలరాస్తూ ముస్లింలు, మైనార్టీలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని రఘువీరారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు, ఇతర మైనార్టీలపై దాడులు జరుగుతుంటే టీడీపీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఫాతిమా వైద్య కళాశాల విద్యార్థులకు నష్టం జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అఫిడవిట్ దాఖలు చేయలేదని నిలదీశారు. విజయవాడలో 13 రోజుల నుండి విద్యార్థులు నిరాహార దీక్షలు చేస్తున్నారని, వారి సమస్య పరిష్కారమయ్యేంత వరకూ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులు ఏవిధంగా నష్టపోయినా ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని రఘువీరారెడ్డి హెచ్చరించారు. సదస్సులో కేంద్ర మాజీ మంత్రి జేడీ శీలం, కర్ణాటక మంత్రి యూటీ ఖాదర్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, మాజీ మంత్రి అహ్మదుల్లా, గుంటూరు జిల్లా, నగర కాంగ్రెస్ అధ్యక్షులు మక్కెన మల్లిఖార్జునరావు, మాదా వెంకట ముత్యాలరావు పాల్గొన్నారు.