ఆంధ్రప్రదేశ్‌

రూ. 35వేల కోట్లతో ఐదున్నర లక్షల ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనకాపల్లి, నవంబర్ 12: రాష్ట్రంలో 35వేల కోట్లతో ఐదున్నర లక్షల ఇళ్ళను పేదవారికి నిర్మించి ఇచ్చే దృఢ నిశ్చయంతో బాబు ప్రభుత్వం పనిచేస్తోందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు. 2018 డిసెంబర్ నాటికి ఈ పక్కాగృహ నిర్మాణం పూర్తయి పేదవారి సొంతింటి కలలు నెరవేరనున్నాయన్నారు. జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి పట్టణానికి చెందిన పేదలకు మండలంలోని సత్యనారాయణపురం వద్ద నిర్మించిన పక్కాగృహాల నిర్మాణాన్ని మంత్రి నారాయణ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక విలేఖరులతో మాట్లాడారు. సిరివల్ టెక్నాలజీతో విదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో ఈ పక్కాగృహ నిర్మాణం జరుగుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణంలో నివశించే పేదలకు సైతం సొంత ఇళ్ళను నిర్మించి ఇచ్చే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అపార్ట్‌మెంట్‌లు, గ్రూప్ హౌస్‌లకు దీటుగా ఈ గృహనిర్మాణం ఉంటుందని చెప్పారు. కిట్కో కంపెనీ ద్వారా విదేశీ టెక్నాలజీతో ఈ గృహ సముదాయం నిర్మిస్తామన్నారు. లే అవుట్‌లో ఇక్కడ నివశించే వారికి మంచినీరు, పార్కు, ఆసుపత్రి తదితర పూర్తి వౌలిక వసతులు కల్పిస్తామన్నారు. రాష్ట్రంలోని నెల్లూరు, కావలి తదితర చోట్ల ఇప్పటికే ఇటువంటి గృహసముదాయాల నిర్మాణం పూర్తయి గృహాలు అందుబాటులోకి వచ్చాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు సంబంధించిన నిధులు సమకూరుస్తున్నాయని, విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా 36వేల 307 ఇళ్ళ నిర్మాణం జరగనుండగా అనకాపల్లి నియోజకవర్గానికి 2,520 ఇళ్ళు మంజూరయ్యాయన్నారు. స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ మున్సిపల్ మంత్రి సహకారంతో జీవీఎంసీ పరిధిలోని అనకాపల్లి పట్టణం అభివృద్ధి చెందుతుందన్నారు. విలేఖర్ల సమావేశంలో పెందుర్తి ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.