ఆంధ్రప్రదేశ్‌

పేదలందరికీ పక్కా ఇళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: రాష్టవ్య్రాప్తంగా ప్రతి పేదవాడికి పక్కా గృహం నిర్మించి అందించాలన్న అప్పటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయం మేరకు ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం పేరుతో 19 లక్షల గృహాలు నిర్మించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిశా నిర్దేశం చేశారని గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖామంత్రి కాలవ శ్రీనివాసులు స్పష్టం చేశారు. శుక్రవారం విశాఖలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల గృహ నిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించిన మంత్రి తనను కలిసిన విలేఖరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ మూడేళ్ళల్లో 3,32,969 గృహాలు నిర్మించగా, గత నెల అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా లక్ష గృహ ప్రవేశాలు చేయించామన్నారు. పేద వాడంటే పూరిల్లు అనే స్థాయి నుండి పక్కాగృహం నిర్మించే స్థాయికి వారి ఎదుగుదల మారిందన్నారు. ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం, ఎన్టీఆర్ పట్టణ గృహ నిర్మాణ పథకం, కేంద్ర నిధుల అనుసంధానంతో ప్రధానమంత్రి అవాస్ యోజన, సొంత స్థలం ఉన్న పేదవారికి అక్కడే గృహాల నిర్మాణానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ప్రస్తుతం గృహ నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో 13 లక్షలు, ఎపిట్ కో ఆధ్వర్యంలో నాలుగు లక్షలు గృహ నిర్మాణాలు జరుగుతున్నాయన్నారు. ఎన్నికల లోపు కనీసం 19 లక్షల గృహ నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. పేదల గృహ నిర్మాణంలో ఎటువంటి అవకవతలకు, అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 2018 జనవరిలో సంక్రాంతి సందర్భంగా 2.5 లక్షలు గృహాలు, 2018 జూన్‌లో మహా సంకల్పం సందర్భంగా మరో 2.5 లక్షల గృహాలు, అక్టోబర్‌లో ప్రపంచ ఆవాస్ దినోత్సవం సందర్భంగా 2.5 లక్షల గృహాలు పూర్తి చేసి 10 లక్షల గృహాలను అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. క్షేత్ర స్థాయి సమస్యలు గుర్తించి పరిష్కరిస్తూ ఎక్కడైనాప్రగతి జరగకపోతే కారణాలు విశే్లసిస్తూ లక్ష్యం పూర్తిచేసే దిశగా కార్యాచరణ రూపొందించి ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఆదేశించినట్టు మంత్రి తెలిపారు.