ఆంధ్రప్రదేశ్‌

‘పాపికొండలు’లో 17 పులులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 17: గత కొంత కాలంగా పాపికొండలు నేషనల్ పార్క్‌లో ఉన్న పులుల సంఖ్యలో పెరుగుతోంది. అధికారిక లెక్కల ప్రకారం ప్రస్తుతం అక్కడ 17 పులులు ఉన్నాయి. ఈ విషయాన్ని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి శిద్దా రాఘవరావు ఇటీవల శాసన మండలిలో ప్రకటించారు. దాదాపు 3 లక్షల ఎకరాల్లో పాపికొండలు నేషనల్ పార్క్ విస్తరించి ఉంది. అభయారణ్యం కావడంతో అనేక రకాల వన్యప్రాణులకు నెలవుగా మారింది. అయితే ఏ రకమైన జంతువులు ఎన్ని ఉన్నాయన్న గణాంకాలు అటవీ శాఖ గుర్తించేందుకు వివిధ ప్రాంతాల్లో 150 కెమెరాలను ఏర్పాటు చేసింది. అభయారణ్యంలో జంతువులు నీటి సమస్యను అధిగమించేందుకు వీలుగా అరమీటరు లోతులో నీటి కుంటలను తవ్వారు. నీటి కోసం అక్కడికి వచ్చే వన్యప్రాణులను కెమెరాల ద్వారా పరిశీలించి, వివిధ జంతువుల సంఖ్యను లెక్కించే పని అటవీ శాఖ చేపట్టింది. దాదాపు రెండు సంవత్సరాలుగా చేపట్టిన ఈ గణాంకాల సేకరణ ప్రక్రియ ఆశించిన ఫలితాలు ఇస్తోంది. ఈ కెమెరాల ఆధారంగా 17 పులులు ఉన్నట్లు గుర్తించారు. అరుదైన రాయల్ బెంగాల్ టైగర్లు కూడా రెండు ఉన్నట్లు గతంలో కెమెరాల ద్వారా గుర్తించారు. ఇంకా అనేక అంతరిస్తున్న జాతులకు చెందిన వన్యప్రాణులు కూడా ఉండటం విశేషం. లేళ్లు, అడవి దున్నలు, హైనాలు, ముళ్లపందులు వంటివి కూడా ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. అయితే కచ్చితంగా వన్యప్రాణులు ఏన్ని ఉన్నాయన్న అంశంపై స్పష్టత లేదు. కెమెరాల ఆధారంగా, స్థానిక గిరిజనులు అందచేసిన సమాచారం ఆధారంగా ఈ అంచనాకు అధికారులు వచ్చారు. కెమెరాలతో నిఘా ఉంచడం వల్ల వేటగాళ్ల బారి నుంచి కూడా జంతువులను కాపాడేందుకు వీలు అవుతోంది. ఇది కూడా పులుల సంతతి పెరిగేందుకు దోహదపడుతోంది.