ఆంధ్రప్రదేశ్‌

రాజధాని రైతుల ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), నవంబర్ 17: రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి చేపట్టిన భూ సమీకరణలో భూములిచ్చిన రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతులకు కేటాయించిన ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఆర్‌డీఏ కమిషనర్ చెరుకూరి శ్రీ్ధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం మందడం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని సందర్శించిన శ్రీ్ధర్ అక్కడ జరుగుతున్న రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలిస్తూ అక్కడ నెలకొన్న సౌకర్యాలతోపాటు రోజుకు ఎన్ని రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయని అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం డొంకలు వాగు కట్టలు తదితరాలు నిషేధిత జాబితా నుంచి తొలగిపోతున్నందున రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇక వేగవంతమవుతుందన్నారు. అలాగే ఇంటర్నెట్ స్పీడ్‌ను మరింత పెంచేందుకు చర్యలు తీసుకుంటానన్నారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ అదనపు కమిషనర్ బిఎల్ చెన్నకేశవరావు, కాంపిటెంట్ అథారిటీ ఏసురత్నం, తుళ్లూరు జడ్పీటీసీ బెజవాడ సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.