తెలంగాణ

భారతీయ వ్యవసాయానికి అనువైన ఆవిష్కరణలు చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 17: భారత దేశంలో అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలకు అనువుగా ఉండే ఆవిష్కరణలు రావాలని ఐఎఫ్‌ఎఫ్‌సిఓ కిసాన్ సంచార్ సంస్థ సిఈవో సందీప్ మల్హోత్రా పిలుపునిచ్చారు. చిన్న, సన్నకారు రైతులకు అందుబాటులో ఉండే సాంకేతిక ఆవిష్కరణలపై జరిగిన చర్చకు అధ్యక్షత వహించిన ఆయన యువ ఇంజనీర్లు ఆధునిక విజ్ఞానాన్ని వ్యవసాయానికి ఉపయోగపడే విధంగా పరికరాలే కాకుండా సమాచార సాంకేతికతను ఉపయోగించి పలు యాప్‌లను రూపొందించడం హర్షణీయమన్నారు. భారతీయ సంస్కృతిలో వ్యవసాయానికి ప్రత్యేక స్థానముందని, సగటు భారతీయుని జీవిత చక్రం సేద్యంపైనే ఆధారపడి ఉంటుందన్నారు. రైతు, పరిశ్రమ, ప్రభుత్వం మధ్య అవిభాజ్య సంబంధం ఉంటుందని, రైతు అభివృద్ధికి పరిశ్రమలు, ప్రభుత్వాలు కృషి చేసిన నాడే వాటి భవిష్యత్ ఆశాజనకంగా ఉంటుందన్నారు. కంపెనీలు, ప్రభుత్వ యంత్రాంగంపై రైతుకు నమ్మకం కలిగించాలన్నారు. వ్యవసాయంలో వ్యయం, సమయం, పనిని తగ్గించే నమ్మకమైన ఆవిష్కరణలు విజయం సాధిస్తాయన్నారు. పరికరాల వాడకం, యాప్‌ల ద్వారా సరైన సమాచారం పొందడంలో రైతుకు సలహాలు సూచనలు చేయాలన్నారు. వివిధ దేశాల వ్యవసాయాలతో పోల్చినపుడు భారతీయ వ్యవసాయం విభిన్నంగా ఉంటుందన్నారు. దేశ నైసర్గిక పరిస్థితులను బట్టి ఎక్కడికక్కడ భూసారాలు, వాతావరణ పరిస్థితులు మారిపోతూ ఉంటాయని, వివిధ పంటల సాగు పక్క, పక్కనే ఉంటాయన్నారు. వివిధ ప్రాంతాల్లో రకరకాలైన భూములు, పంటలు పండిస్తూ ఉంటారని, ఆయా ప్రాంతాలకు తగినట్టు, పంటలకు సరిపడే విధంగా విత్తడం, ఎరువులు, మందులు జల్లడం, కోత, నూర్పు మొదలైన వాటిని సులభంగా చేసేందుకు అనువైన పరికరాలను రూపొందించాల్సి ఉందన్నారు. రైతుల్లో ఎక్కువమంది పెద్దగా చదువుకోని వారేనని, సాంప్రదాయ సాగు పద్ధతులు అధికారుల సలహాలనుబట్టి పంటలు పండిస్తూ ఉంటారన్నారు.