ఆంధ్రప్రదేశ్‌

ప్రజలకు హాని తలపెట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, నవంబర్ 18: భారత పాలకవర్గాలు విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు కొనసాగిస్తున్న బహుముఖ యుద్ధంలో మానసిక యుద్ధం ఒకటని, విప్లవోద్యమంలో అనేక తప్పుడు ప్రచారాలు సృష్టించి తమను నైతికంగా దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో ప్రజాసంఘాలు కూడా వాస్తవాలను గుర్తించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలకు సంబంధించి సమగ్ర వివరణ ఇస్తూ కేంద్ర కమిటీ లేఖ రాసింది. విప్లవోద్యమంలో అంతర్గతంగా అనేక అవిశ్వాసాలను పెంచి నీరుగార్చడం, విప్లవ శక్తులను లొంగదీసుకుని, లోబరచుకోవటం, వ్యవస్థ లక్ష్యాలలో భాగంగా పేర్కొంది. ఈ లక్ష్యాల నేపథ్యంలోనే మిషన్-2017లో అనేక తప్పుడు ప్రచారాలకు ఒడికడుతూ అనేక ప్రజా వ్యతిరేక చర్యలలో మావోయిస్టు పార్టీని భాగస్వామిగా చూపుతోందన్నారు. సామాన్య ప్రజలు ఏ రకంగా ఆలోచించినా.. ఇప్పటి వరకు మొక్కవోని దీక్షతో విప్లవోద్యమ పక్షాన నిలబడుతున్న ప్రజాసంఘాలు వెంటనే స్పందించి ప్రతిక్రియను వ్యక్తం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. ఇది కొన్ని సందర్భాలలో పొరపాట్లకూ, అపార్థాలకూ దారి తీస్తోందన్నారు. ప్రజావ్యతిరేక సంఘటనలో వాస్తవాలను నిశతంగా పరిశీలించిన తరువాతే నిర్ణయం తీసుకోవాలని హక్కుల సంఘాలను కోరుతూ గతంలో జరిగిన కొన్ని ఉదంతాలకు పార్టీ వివరణ ఇచ్చింది. ఈ ఏడాది జనవరి 17న చత్తీస్‌గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా ఘోడాగాంలో మందుపాతర పేలి ముగ్గురు మహిళలు మృతిచెందారనే వార్తను సామాజిక మాధ్యమాల ద్వారా పోలీసులు ప్రచారం చేశారు. దీనిపై మావోయిస్టులను నిందిస్తూ పోలీసులు విస్తృత ప్రచారానికి పూనుకున్నారు. అప్పట్లో బస్తర్ ఎస్పీగా ఉన్న కల్లూరి శివరాంప్రసాద్ ప్రజలను కూడగట్టి ర్యాలీలు నిర్వహించారు. ఈ సంఘటనపై పీయూసీఎల్ సంస్థ కూడా వ్యతిరేకంగా స్పందించింది. అయితే వాస్తవానికి అక్కడ మందుపాతర పేలలేదు. మావోయిస్టులు పేల్చలేదు. ఆ గ్రామ పరిసరాల్లో గస్తీ చేస్తున్న పోలీసుల్లో ఒకరు మోర్టార్ షెల్ పోగొట్టుకున్నారు. అది ఓ మహిళకు దొరికింది.. అలా దొరికిన షెల్‌ను ఓ మహిళ తనకు తెలిసిన వారికి చూపించి విసిరేసింది. అది పేలటంతో అక్కడ కొందరు గాయపడ్డారు. ఈ సంఘటనపై గ్రామస్థులు చర్చించి పరిష్కరించుకున్నారు. వాస్తవానికి ఏదైనా సంఘటన జరిగిన వెంటనే పార్టీ చర్య అయిందీ, కానిదీ వివరణ ఇస్తోంది. ఈ సంఘటనలో జాప్యం జరగటంతో జరక్కూడని నష్టం జరిగిందని పార్టీ తన సుదీర్ఘ లేఖలో ఉటంకించింది. సాధారణంగా అటవీ ప్రాంతంలో కొన్ని మందు పాతర్లు అమర్చడం.. వాటిని వెలికితీయటం పోలీసు చర్యల్లో భాగమైంది.. ఇలాంటి సందర్భాలలో ఏదైనా సంఘటన జరిగితే దుష్ప్రచారాన్ని సాగిస్తున్నారు. ఈ ఏడాది జనవరి 22న ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో హీరాఖండ్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదంలో అనేకమంది మృతిచెందగా చాలామంది గాయపడ్డారు. దీనిపై వార్తలు వెలువడుతున్న తరుణంలోనే మావోయిస్టులపనే అంటూ మాజీ ఐజీ కల్లూరి ప్రచారం చేశారు. ఒడిశా పోలీసులు మాత్రం ఇది మావోయిస్టుల చర్యకాదని తేల్చిచెప్పారు. అదే సమయంలో బస్తర్ డివిజన్ దంతేవాడ జిల్లాలోని డోల్‌కల్ కొండపై ఉన్న వెయ్యేళ్లనాటి ప్రాచీన వినాయక విగ్రహం మూడువేల అడుగుల పైనుండి కిందపడి ముక్కలైంది. దీనికి మావోయిస్టులు కారణమంటూ నిందించారు. పురావస్తు శాస్తవ్రేత్తలు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. ప్రజల భక్తి విశ్వాసాలతో పోలీసుల మాదిరిగా మావోయిస్టులు మూర్ఖంగా వ్యవహరించరనే కనీసజ్ఞానం లేకుండా దుష్ప్రచారం చేశారని పార్టీ కేంద్ర కమిటీ మధ్య రీజనల్ బ్యూరో అధికార ప్రతినిధి ప్రతాప్ పేరిట లేఖ వెలువడింది.
అర్ధశతాబ్దానికి పైగా తమతో పాటు చిత్రహింసలు, అరెస్టులు, వేధింపులకు గురవుతున్న హక్కుల సంఘాలు మొక్కవోని దీక్షతో విప్లవోద్యమాన్ని ముందుకు నడుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ఏదైనా ప్రజా వ్యతిరేక సంఘటన జరిగినప్పుడు వాస్తవాలను పరిగణనలోకి తీసుకోవాల్సిందిగా పార్టీ కేంద్ర కమిటీ విజ్ఞప్తి చేసింది.