ఆంధ్రప్రదేశ్‌

కోస్టల్ కారిడార్ అథారిటీ ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 18: రాష్ట్రంలో విస్తారమైన తీర ప్రాంతాన్ని ఏకం చేస్తూ కోస్టల్ కారిడార్ అథారిటీ ఏర్పాటు చేయనున్నట్టు పరిశ్రమల శాఖ మంత్రి అమర్‌నాథ్ రెడ్డి వెల్లడించారు. విశాఖలో రీజనల్ స్థాయి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సదస్సు శనివారం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కోస్టర్ కారిడార్ అథారిటీ ఏర్పాటునకు సంబందించి త్వరలోనే అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టనున్నట్టు తెలిపారు. అలాగే రాష్ట్రంలో రూ.50వేల కోట్లతో కోస్టర్ ఎంప్లాయిమెంట్ జోన్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం విస్తృత చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్‌ఎంఈ పార్కును ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే 24వేల ఎంఎస్‌ఎంఈలను ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలకు రూ.2,718 కోట్ల మేర ప్రోత్సాహకాలను విడుదల చేయగా, రూ.570 కోట్లను ఎంఎస్‌ఎంఈలకే కేటాయించామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ప్రస్తుత సంవత్సరం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. పారిశ్రామిక ప్రాంతాల్లో వౌలిక సదుపాయాల కల్పనకు ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు సహకారంతో రూ.5,500 కోట్ల నిధులు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించి సర్వీసెస్ గ్యారంటీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్టు ఆయన తెలిపారు. నిర్ధిష్ట సమయంలో సేవలందని పక్షంలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.