ఆంధ్రప్రదేశ్‌

సర్కారు సొమ్ము పర్యటనల పాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న ఆప్కాబ్‌లో నిధులను దుర్వినియోగం చేస్తున్నారనే అభియోగాలు చుట్టుముడుతున్నాయి. సరిగ్గా మరో 60 రోజుల్లో పదవీ కాలం ముగియబోతున్న నేపధ్యంలో ఆప్కాబ్‌లో డైరెక్టర్లుగా వ్యవహరిస్తున్న 13 జిల్లాల కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్లు, మరో ఇద్దరు అధికారులతో కలిసి మొత్తం 15 మంది విదేశీ పర్యటనకు వెళ్లారు. సింగపూర్‌లో వ్యవసాయ సహకార సంఘాల పనితీరును అధ్యయనం పేరిట వీరందరూ కలిసి ఈనెల 9వ తేదీ బయల్దేరి వెళ్లారు. తిరిగి మరో వారం రోజుల్లో రాష్ట్రానికి చేరుకోనున్నారు. ఐదేళ్ల పదవీ కాల పరిమితితో డైరెక్టర్లుగా కొనసాగుతున్న వీరు ఇంతకాలం అధ్యయనాలపై దృష్టి సారించకుండా పదవుల నుంచి వైదొలుగుతున్న సమయంలో చేపట్టే ఈ అధ్యయన యాత్ర విహార యాత్రకా అన్నట్టుగా ఉందని ఆరోపణలు వస్తున్నాయి. త్వరలో జరిగే ఎన్నికల్లో గెలిచి వచ్చే డైరెక్టర్లు వీరి అధ్యయన యాత్ర అనుభవాలను పరిగణనలోకి తీసుకుంటారనే గ్యారంటీ లేదు. తిరిగి వారు కూడా అధ్యయన యాత్రలకు శ్రీకారం చుడితే లక్షలాది రూపాయల నిధులు దుర్వినియోగం మినహా రైతులకు ఒరిగేదేమీ లేదంటున్నారు. ప్రస్తుత యాత్రకు దాదాపు రూ. 15లక్షలకు పైగా ఖర్చు చేస్తున్నట్లు ప్రాథమిక అంచనా. ప్రస్తుతం ఆప్కాబ్ డైరక్టర్లుగా వ్యవహరిస్తున్న వారిలో అత్యధికులు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆ పార్టీ నుంచి గెలుపొందినవారే కావడం గమనార్హం. ప్రస్తుత చైర్మన్ పిన్నమనేని వెంకటేశ్వరరావు సైతం కాంగ్రెస్ తరపునే కృష్ణాజిల్లా కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్‌గా ఎన్నికై రాష్ట్ర విభజనానంతరం తెలుగుదేశంలో చేరి ఆప్కాబ్ చైర్మన్ పదవిని దక్కించునున్నారు.