ఆంధ్రప్రదేశ్‌

‘పోలవరం’ పనుల విభజన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 18: ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న పోలవరం ప్రాజెక్టు పనుల్లో జాప్యాన్ని నివారించేందుకు వీలుగా కొన్ని పనులను వేరే కంపెనీలకు అప్పజెప్పేందుకు వీలుగా టెండర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించింది. 1395 కోట్ల రూపాయల అంచనాతో ఈ మేరకు టెండర్లను ఆహ్వానిస్తూ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్పిల్ చానల్, స్పిల్‌వే, తదితర పనులను ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు అప్పగించింది. 2018 నాటికి పోలవరం ద్వారా నీటిని అందచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ తీరుతో పనుల్లో జాప్యం జరుగుతోంది.
ఇతర కంపెనీలకు చెల్లింపుల్లో ట్రాన్స్‌ట్రాయ్ అనుసరిస్తున్న వైఖరి కారణంగా ప్రాజెక్టు పూర్తి కావడంలో జాప్యం అనివార్యం కానున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిని దృష్టిలో ఉంచుకుని 60సి నోటీసులను ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. ఈ నోటీసు నేపథ్యంలో ట్రాన్స్‌ట్రాయ్ చేపట్టిన పనుల్లో కొంత శాతం మేర పనులను ఇతర సంస్థలకు అప్పగించే వీలు ఉంటుంది. దీంతో స్పిల్‌వేలో 60 శాతం పనులకు, స్పిల్ చానల్‌లో 40 శాతం కాంక్రీట్ పనులకు, 1.4 కోట్ల క్యూబిక్ మీటర్ల మట్టి పనులకు టెండర్లను ఆహ్వానించారు.
ఈ పనులకు 1395 కోట్ల రూపాయలు అవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. పోలవరం పనుల కాంట్రాక్టరును మార్చవద్దని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, 60సి నిబంధన మేరకు ప్రధాన కాంట్రాక్టురు నుంచి కొంత మేర పనులను తప్పిం చి, వేరే సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 4లోగా టెండర్లను ఖరారు చేసేందుకు నిర్ణయించింది.