ఆంధ్రప్రదేశ్‌

జాతీయ స్థాయి రాక్‌డ్రమ్స్ షోకు అభ్యర్థుల ఎంపిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, నవంబర్ 18: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో రాష్టస్థ్రాయిలో డిసెంబరు 19నుండి 21వ తేదీ వరకు నిర్వహించే ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్‌లో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీత ప్రదర్శన ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మూడు రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించేందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్ట ఏర్పాట్లు చేస్తోంది. ఫెస్టివల్ చివరిరోజైన డిసెంబరు 21వ తేదీన ఏఆర్ రెహమాన్ సమక్షంలో జాతీయస్థాయిలో రాక్‌డ్రమ్స్ ప్రదర్శన కోసం అభ్యర్థుల ఎంపిక నిర్వహిస్తారు. ఈ ప్రదర్శనలో ప్రతిభావంతులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కాకినాడ సాగర సంబరాల్లో రెహమాన్ ముందు ప్రదర్శించేందుకు 50 మందిని ఎంపిక చేస్తారు. వీరిలో ఉత్తమ ప్రతిభ కనబరచిన ఎనిమిది మందిని రహమాన్‌తో కలసి వేదికపై సంగీత ప్రదర్శన ఇచ్చే అవకాశం కల్పిస్తారు. రెహమాన్ సంగీత రంగంలో ప్రవేశించి 25 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో రజతోత్సవ వేడుకలకు కాకినాడ బీచ్ ఫెస్టివల్ వేదికగా నిలుస్తుండటం విశేషం! రాక్‌డ్రమ్స్ జాతీయ స్థాయి ఎంపికలో పాల్గొనేందుకు ఆసక్తి కలిగిన కళాకారుల నుండి ఇప్పటికే రెహమాన్ టీం వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానించింది. మరోవైపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రభుత్వ యంత్రాంగం పటిష్టమైన ఏర్పాట్లు చేస్తోంది. జాతీయ స్థాయిలో ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడిగా పేరొందిన రెహమాన్ తొలిసారిగా కాకినాడలో ప్రదర్శన నిర్వహిస్తుండటంతో ఈ కార్యక్రమాన్ని అధికారులు ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. పెద్ద ఎత్తున షోకు ఏర్పాట్లు చేస్తున్నారు. సాగర సంబరాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ప్రస్తు తం బీచ్ సుందరీకరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ పథకం కింద సుమారు 45కోట్ల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. డిసెంబరు 10వ తేదీకి అభివృద్ధి పనులు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది. అలాగే ఈనెల 25వ తేదీలోగా కాకినాడ ఎన్టీఆర్ బీచ్ ఫెస్టివల్ నిర్వహణకు సంబంధించి ప్రణాళికలను ఖరారు చేస్తామని జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా చెప్పారు. ల్యాండ్ స్కేపింగ్, షాపింగ్ కాంప్లెక్స్, కాన్ఫరెన్స్ హాలు, లేజర్ షో, వాటర్ ఫౌంటేన్ వంటి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు.
సుమారు 2 కోట్ల వ్యయంతో బీచ్ పచ్చదనంతో నిండిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నామని, ప్రభుత్వ- ప్రైవేటు భాగస్వామ్యంతో ఎన్టీఆర్ బీచ్‌లో హోటల్, రిసార్ట్స్ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు.

చిత్రం..కాకినాడ ఎన్టీఆర్ బీచ్‌లో అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తున్న కలెక్టర్ కార్తికేయ మిశ్రా