ఆంధ్రప్రదేశ్‌

సోషల్ మీడియాదే హవా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (బెంజిసర్కిల్), నవంబర్ 18: ఆధునిక సమాజంలో సోషల్ మీడియా కీలకమైన భూమిక పోషిస్తోందని, సమాజంలో జరిగే అనేక అంశాలకు చర్చా వేదికగా నిలుస్తోందని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎ-కనె్వన్షన్ సెంటర్‌లో దేశంలోనే తొలిసారిగా నిర్వహిస్తున్న సోషల్ మీడియా సమ్మిట్-17లో మంత్రి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి భూమా అఖిలప్రియ మాట్లాడుతూ రాష్ట్రంలో టెక్నాలజీని ప్రవేశపెట్టిన ఘనత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికే దక్కుతుందన్నారు. టెక్నాలజీ అనునిత్యం నూతన పోకడలకు, ఆవిష్కరణలకు ప్రధాన బిందువుగా నిలుస్తోందన్నారు. సోషల్ మీడియాలో వివిధ దశల్లో సమాజానికి ఉపయోగపడే పలు అంశాలపై చర్చలకు వేదికగా వినియోగించుకుంటున్నారన్నారు. సోషల్ మీడియా ప్రధాన భూమికను పోషిస్తోందని అయితే ప్రజలు కూడా అందుకు అనుగుణంగా స్పందించాల్సి ఉందన్నారు. గ్రామస్థాయి వరకు సోషల్ మీడియా వ్యాప్తి చెందడం గమనిస్తున్నామన్నారు. పర్యాటకశాఖ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 24 మెగా ఈవెంట్లను నిర్వహిస్తున్నామన్నారు. సోషల్ మీడియా అవార్డ్ ఫంక్షన్స్‌ను ఆదివారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నగర పోలీస్ కమిషనర్ గౌతం సవాంగ్ మాట్లాడుతూ సామాజిక మాధ్యమాలను వినియోగించే ప్రజలు పోస్టింగులు వేసే సమయంలో స్వయం నియంత్రణ కలిగి ఉండాలన్నారు. ప్రజలకు ఏదైనా చెప్పాలన్నా సమాజ హితం కోరుతూ సందేశాలు ఇవ్వాలన్నా మంచి వేదికగా సోషల్ మీడియా నిలుస్తుందన్నారు. టెక్నాలజీ చాలా వేగంగా మార్పులు చెందుతుందని ఆ పరిస్థితులకు అనుగుణంగానే వాటిని అందుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ మాధ్యమం ద్వారా కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత గోప్యతలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని, అవి సమాజ హితం కావన్నారు. మార్గదర్శకాలకు లోబడే ఇటువంటి మాధ్యమాల్లో భాగస్వామ్యం కావాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. విబ్రూ మీడియా సిఈవో అశోక్ విద్యాసాగర్ మాట్లాడుతూ సాధారణ పౌరులు కూడా సామాజిక మాధ్యమాలను వినియోగించుకుంటున్నారని, తద్వారా ఆయా ప్రాంతాల భాషలకు ప్రచారాన్ని కూడా కలుగజేయడం సాధ్యమవుతుందన్నారు. సోషల్ మీడియా అంటే ఏమిటి, సమాజంలో సోషల్ మీడియాకు ఔన్నత్యం, ప్రాధాన్యతలపై ఐఐఎం లక్నో ప్రొఫెసర్ వౌటుసిమైటీ చర్చా వేదికలో పాల్గొన్నారు. వీడియో క్లిప్పింగ్‌లు సామాజిక చేర్పునే ఎలా పెంచుతాయి, వాటిలో ప్రజలు ఏ విధంగా భాగస్వామ్యం అవుతున్నారు, వాటి వలన సమాజానికి జరిగే లబ్ది, ఆయా పోస్టింగ్‌లు వేసే వ్యక్తులకు జరిగే లబ్ధిపై యూట్యూబ్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్య ప్రతినిధి సత్య రాఘవన్ వివరించారు. ఫేస్‌బుక్ మీడియా రీజనల్ పార్టనర్ ప్రతినిధి అంకూర్ మెహతా నేటి ప్రపంచ వ్యవస్థలో ఫేస్‌బుక్ భూమిక, ప్రజల భాగస్వామ్యంపై మాట్లాడారు. ట్విటర్ ఆసియా ఫసిఫిక్ క్రీడా భాగస్వామి ప్రతినిధి అనీష్ మధాని సామాజిక నిర్మాణం, క్రీడాంశాల ప్రాధాన్యత విధానంలో ట్విటర్ భూమికను వివరించారు.

చిత్రం..సోషల్ మీడియా సమ్మిట్‌లో మాట్లాడుతున్న మంత్రి అఖిలప్రియ