ఆంధ్రప్రదేశ్‌

వేణుగోపాలస్వామి రథోత్సవం కమనీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పుట్టపర్తి, నవంబర్ 18: పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జయంతి వేడుకల ప్రారంభం రోజు శ్రీ వేణుగోపాలస్వామి రథోత్సవం నేత్రపర్వంగా సాగింది. ఉదయం సాయికుల్వంత్ హాలులో వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రకరకాల పూలతో అందంగా అలంకరించిన రథంపై స్వామివారిని ఆశీనులను చేసి పూజలు, హారతి ఇచ్చారు. పల్లకిలో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఉంచి పూజలు చేశారు. భక్తుల జయజయధ్వనాల మధ్య రథం ముందుకుసాగింది. సత్యసాయి ట్రస్టు సభ్యులు ఆర్‌జె.రత్నాకర్, చక్రవర్తి, ప్రసాదరావు, ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డి, డిసిసి అధ్యక్షులు కోటా సత్యం, రత్నాకరం వంశీయులు, భక్తులు రథాన్ని లాగారు. మేళతాళాలు, మంగళవాయిద్యాలు, సాయి విద్యార్థులు వేదపఠనంగా వినిపిస్తుండగా రథం పట్టణ పురవీధుల్లో ముందుకు సాగింది.