ఆంధ్రప్రదేశ్‌

‘ఆర్థిక నగరం’గా జక్కంపూడి’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: ఒకే పంట విధానానికి స్వస్తిచెప్పి అన్ని రకాల పంటలను పండించే విధానాలను రైతులు అలవరచుకోవాలని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సూచించారు. ఆదివారం విజయవాడ రూరల్ మండలం గొల్లపూడి వ్యవసాయ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ వరి పంటతో పాటు రైతులు ఆరుతడి పంటలను కూడా ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. పట్టిసీమ నీరు కృష్ణాడెల్టా భూములకు అందటంతో పొలాల నేలలు సారవంతమయ్యాయని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసుకోవటం ద్వారా నవ్యాంధ్రప్రదేశ్‌లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చెయ్యాలనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆలోచనని తెలిపారు. అందుకనే బాధ్యత లేని విపక్ష పార్టీలు పోలవరం పనులకు అడ్డుపడుతున్నా, చికాకులు పెడుతున్నా మనోనిబ్బరంతో ముఖ్యమంత్రి పోలవరం మహా సంకల్పాన్ని పూర్తి చేసేలా నిర్విరామంగా శ్రమిస్తున్నట్లు తెలిపారు. రాబోవు కాలంలో జక్కంపూడి ప్రాంతం ఆర్ధిక నగరంగా అభివృద్ధి చెందబోతుందని తెలిపారు. జక్కంపూడి, గొల్లపూడి ప్రాంతంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు నిర్మించాలనే సంకల్పం తనకుందని ఇందుకు పెద్దలు, ప్రజాప్రతినిధులు స్పందిస్తే కార్యరూపం దాలుస్తుందని చెప్పారు. మంత్రి మహాసంకల్పానికి ప్రతి స్పందనగా విజయవాడ రూరల్ మండల పరిషత్ అధ్యక్షుడు వడ్లమూడి జగన్మోహన్‌రావు 60:40 నిష్పత్తిలో 50 ఎకరాల భూమిని నివేశన స్థలాలకు కేటాయించేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. ఇందుకు మంత్రి అభినందనలు తెలుపుతూ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ఆదేశించారు. మాటేరు యూనివర్సిటీ పరిజ్ఞానం ద్వారా తయారుచేసిన కొత్త రకం వంగడం 1156 ధాన్యాన్ని తీసుకువచ్చారు. ఈ వంగడం ధాన్యాన్ని మంత్రి పరిశీలించారు. ఎకరాకు 35 నుండి 40 బస్తాలు దిగుబడులు వస్తున్నట్లుగా రైతులు తెలిపారు.
ఈ కార్యక్రమం సందర్భంగా ‘చంద్రన్న రైతు రథం పథకం’ కింద ఆరుగురు రైతులకు సబ్సిడీతో ట్రాక్టర్లను అందజేశారు.

చిత్రం..ఓ రైతుకు సబ్సిడీపై ట్రాక్టర్ అందజేస్తున్న మంత్రి దేవినేని ఉమా