ఆంధ్రప్రదేశ్‌

‘కమలం’లో అసంతృప్తి సమరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన ‘అసలు-నకిలీ బీజేపీ’ వ్యాఖ్యలపై కమలంలో సీనియర్ల మధ్య అంతర్యుద్ధం మొదలయింది. పోలవరంపై పురంద్రేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నకిలీ బీజేపీ నేతలే మాట్లాడుతున్నారు తప్ప, ఒరిజినల్ బీజేపీ నేతలు మాట్లాడటం లేదంటూ మంత్రి అయ్యన్నపాత్రుడు చేసిన వ్యాఖ్యలపై ఖండన పర్వానికి తెరలేవకపోవడంపై, భారతీయ జనతా పార్టీలో అసంతృప్తికి కారణమవుతోంది. అయ్యన్న వ్యాఖ్యలతో రాష్ట్ర అధ్యక్షుడు మినహా వౌనంగా ఉన్న వారంతా అసలు బీజేపీ అని, పోలవరంపై మాట్లాడుత్ను వారే నకిలీ బీజేపీ నేతలన్న అర్ధం స్ఫురించినట్టయింది. దీనిపైనే ఇప్పుడు పార్టీలో చర్చ జరుగుతోంది.
అయ్యన్న వ్యాఖ్యలను ఖండిస్తూ ఎదురుదాడి చేయాలని బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి ఆ పార్టీ సీనియర్ నేత రవీంద్రరాజు జిల్లా నాయకులకు ఆదేశాలు జారీ చేశారు. అయితే, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు సహా, ఆయన వర్గానికి చెందిన వారెవరూ ఇప్పటివరకూ ఎదురుదాడి మాట అటుంచి, కనీసం ఖండనలు కూడా ఇవ్వకపోవడం చర్చనీయాంశమయింది. ఈ విధంగా వౌనంగా ఉండటం వల్ల ఇతర పార్టీల నుంచి వచ్చిన వారంతా, నకిలీ బీజేపీ నేతలేనన్న ప్రత్యర్ధుల విమర్శలు నిజమనుకునే ప్రమాదం ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ కోసం పనిచేస్తున్న తామే అసలైన బీజేపీ నేతలైతే, టీడీపీ భజన చేసే వారే నకిలీ బీజేపీ నేతలన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో బీజేపీ జిల్లా నాయకత్వాలు ఎక్కువగా ఒక సామాజికవర్గం చేతుల్లోనే ఉండటం, వారంతా గతంలో రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేసిన నేత అనుచరులే కావడంతో, పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని బీజేపీ సీనియర్లు వాపోతున్నారు.
చాలాకాలం నుంచీ టీడీపీ నేతలు ప్రధాని, తమ పార్టీపై విమర్శలు చేస్తున్నా రాష్ట్ర అధ్యక్షుడి సహా ఆయన వర్గమంతా వౌనంగా ఉంటుండగా, పార్టీలో చేరిన పురంద్రీశ్వరి, కన్నా వంటి నేతలే వారిపై ఎదురుదాడి చేస్తున్నారు. పార్టీలో సీనియర్ నేత, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి, బీజేవైఎం అధ్యక్షుడు విష్ణువర్ధన్‌రెడ్డి, రామకోటయ్య వంటి కొద్దిమంది మాత్రమే తమ పార్టీపై వస్తున్న విమర్శలకు ఘాటు జవాబులిస్తున్నారు. అధ్యక్షుడు, వైద్యశాఖ మంత్రి అధికారపార్టీ ఆకాంక్షలకు అనుగుణంగా వ్యవహరిస్తున్నారని, మరో మంత్రి ఇవేమీ పట్టకుండా, పార్టీ కోణంలో అడుగులేయడం లేదన్న విమర్శలు ఇంకా కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితిని గమనించిన కేంద్ర నాయకత్వమే పోలవరం ప్రాజెక్టుపై పురంద్రీశ్వరి,కన్నాను పిలిపించి, మంత్రి గడ్కరీ సహా జలవనరుల శాఖ అధికారులతో చర్చలు జరపడంతో కథ కొత్త మలుపు తిరిగింది. రాష్ట్రంలో టీడీపీ పోలవరంపై కేంద్రాన్ని ముద్దాయిగా నిలబెట్టేందుకు చేస్తున్న వ్యూహం, దానికి కొన్ని మీడియా సంస్థల సహకారం వివరిస్తూ కేంద్ర నాయకత్వానికి ఫిర్యాదు చేయడంతో, పోలవరంపై కేంద్రం తన వైఖరి మార్చుకుని, ఇకపై పోలవరం అంశంలో ఏం జరిగినా అందులో రాష్ట్రానికి చెందిన పురంద్రీశ్వరి, కన్నా, సోము వీర్రాజును భాగస్వాములను చేయాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అంతకుముందే పురంద్రీశ్వరి ముఖ్యమంత్రికి లేఖ రాసి, పోలవరంపై కేంద్రంతో చర్చించే కమిటీలో తమనూ భాగస్వాములను చేయాలని కరారు.