ఆంధ్రప్రదేశ్‌

నేటి ‘చలో అసెంబ్లీ’ ఆగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 19: ముందస్తు అరెస్ట్‌లు, నిర్బంధాలతో సోమవారం జరిగే ‘చలో అసెంబ్లీ’ ఆందోళన కార్యక్రమాన్ని ఆపలేరని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ, సిపి ఎం నేత సిహెచ్ బాబూరావు అన్నారు. స్థానిక దాసరి భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జీ ఓబులేసు, జల్లి విల్సన్, రావుల వెం కయ్యతో కలిసి వారు మాట్లాడారు. రాష్ట్ర విభజన జరిగి మూడున్నరేళ్లు దాటినా ఇంతవరకు విభజన అంశా లు ఒక్కటి కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదని రామకృష్ణ అన్నారు. విద్య, వైద్య సంస్థలకు శంకుస్థాపనలు చేసి వదిలేశారన్నారు. విశాఖ రైల్వేజోన్, కడప ఉక్కు పరిశ్రమ ఊసే ఎత్తడం లేదన్నారు. రాజధాని, పోలవరం ప్రాజె క్టు నిర్మాణాలకు కేంద్రం ఏమా త్రం సహకరించకపోగా తీవ్ర ఆటంకాలు కల్పిస్తోందన్నారు. కనీసం రెవిన్యూ లోటు భర్తీకి కూడా నిధులివ్వడం లేదనీ, అభివృద్ధిలో వెనుకబడ్డ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాం తాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇస్తామని చెప్పి జిల్లాకో రూ.50 కోట్లు విదిలించారన్నారు. చివరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేసే వివిధ సంక్షేమ పథకాల అమల్లో కూడా ఏపీ పట్ల కేంద్రం పక్షపాత వైఖరి అవలంభిస్తోందని రామకృష్ణ తీవ్రంగా విమర్శించారు.
ప్రధాన మంత్రి యోజన పథకం కింద బీజేపీ పాలిత రాష్ట్రాలకు 26 శాతం నిధులు కేటాయిస్తే ఏపీకి కేవలం 0.38 శాతం నిధులు మాత్ర మే కేటాయించడం ఇందుకు నిదర్శనమన్నారు. రాజకీయ స్వార్థం కోసం రాష్ట్ర ప్రయోజనాలను సైతం తాకట్టు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు.