ఆంధ్రప్రదేశ్‌

విహారంలో విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరాల, వేటపాలెం, నవంబర్ 19: ఒకే ప్రాంతానికి చెందినవారంతా కలసి వన భోజనాలు చేసేందుకు వచ్చారు. అనుకోకుండా జరిగిన హఠాత్పరిణామం వారిలో ఇద్దరిని బలి తీసుకుంది. కళ్లముందే సముద్రంలో కొట్టుకుపోతుంటే ఏమీచేయలేని నిస్సహాయ స్థితి నెలకొంది. అలల్లో చిక్కుకున్న మహిళలను రక్షించే ప్రయత్నంలో ఓ యువకుడిని మృత్యువు కబళించగా, మరో వ్యక్తి కెరటాల్లో కొట్టుకుపోయి గల్లంతయ్యాడు. ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం రామాపురం సముద్రతీరంలో ఆదివారం జరిగిన ఈ దుర్ఘటనతో విహారయాత్రలో తీవ్ర విషాదం నెలకొంది. బాధితులు తెలిపిన వివరాల మేరకు గుంటూరు జిల్లా కొరిటపాడుకు చెందిన సుమారు 30 మంది కార్తీకమాస వనభోజనాలు చేసేందుకు ఆదివారం రామాపురం బీచ్‌కు వచ్చారు. వారిలో కొంతమంది వంట చేస్తుండగా, మరికొందరు సముద్రంలో స్నానాలు చేసేందుకు వెళ్లారు. వంట పూర్తయి భోజనాలు ప్రారంభించే సమయంలో అనుకోకుండా విషాద సంఘటన చోటుచేసుకుంది. వారిలో నాలుగు నెలల గర్భిణీ జ్యోతితో పాటు పార్వతి సముద్రంలో లోతుకు వెళ్లారు. దీనిని గమనించిన తోటి పర్యాటకులు వారిని హెచ్చరిస్తు కేకలు వేశారు. గుంటూరులో మెకానిక్‌లుగా పనిచేస్తున్న యోగి, వౌలాలి మహిళలిద్దరికి తోడుగా వెళ్లారు. అలల ఉద్ధృతి ఎక్కువగా ఉండడంతో వారు అదుపుతప్పి సముద్రంలో కొట్టుకుపోయారు. మిగిలిన ముగ్గురిని ఒడ్డుకు చేర్చగా వౌలాలి మాత్రం సముద్రంలో గల్లంతయ్యాడు. యోగి, జ్యోతి చనిపోగా పార్వతికి చీరాలలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో సాయంత్రం గుంటూరు తరలించారు. గల్లంతైన వౌలాలి ఆచూకీ తెలియాల్సి ఉంది. గ్రామీణ సిఐ భక్తవత్సలరెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. విహారయాత్రకు వచ్చిన బృందంలో ఇద్దరు మృత్యువాత పడగా మరొకరు గల్లంతు కావడంతో విషాదం అలుముకుంది.