ఆంధ్రప్రదేశ్‌

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, నవంబర్ 19: దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని సీపీఎం పాలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆరోపించారు. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డిసిఐ) అమ్మకాన్ని విరమించుకోవాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో ఆదివారం జగదాంబ జంక్షన్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ డిసిఐని ఎటువంటి పరిస్థితుల్లోను అమ్మరాదన్నారు. చైనా ఆర్థిక వ్యవస్థను దాటిపోతామని చెబుతున్న వారు అక్కడ కీలక పరిశ్రమలన్నీ ప్రభుత్వరంగంలోనే ఉన్నాయన్న విషయాన్ని గుర్తించాలని కోరారు. అలాగే చైనాలో అధిక సంఖ్యలో ఓడరేవులు ఉన్నాయని, మన దేశంలో కూడా అధిక సంఖ్యల ఓడరేవులను ఏర్పాటు చేయడం ద్వారానే ఆర్థికాభివృద్ధి జరుగుతుందన్నారు. ఓడరేవుల ఏర్పాటులో డ్రెడ్జింగ్ కార్పొరేషన్ కీలకపాత్ర పోషించిందన్నారు. అంతర్గత వనరులతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తూ ప్రపంచంలోని మొదటి పది సంస్థల్లో డీసీఐ ఒకటిగా ఎదిగిందన్నారు. ఇలాంటి సంస్థను అమ్మేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలకు కేంద్రం విశాఖపట్నంగా పేర్కొన్నారు. డీసీఐతోపాటు హెచ్‌పీసీఎల్, ఓఎన్‌జీసీ, రైల్వే, తదితర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. విశాఖను పూర్తిగా ప్రైవేటు కంపెనీల చేతిలో పెట్టడానికి బీజెపీ ప్రభుత్వం తీవ్ర చర్యలకు పాల్పడుతోందన్నారు. దేశాన్ని దివాలా తీసే కార్యక్రమానికి మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం పూనుకుంటోందన్నారు. అమ్మడం, కొల్లగొట్టడమే దేశభక్తా అంటూ కేంద్రాన్ని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణ అందరి బాధ్యతగా పేర్కొన్నారు. ప్రభుత్వం తన నిరంకుశ వైఖరిని విడనాడకపోతే పెద్దఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. విశాఖ కేంద్రంగా నాలుగు దశాబ్దాలుగా అభివృద్ధి పథంలో పయనిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ అయిన డీసీఐని ప్రైవేటీకరిస్తే రాష్ట్ర ప్రయోజనాలకు కూడా ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తక్షణమే స్పందించి కేంద్రప్రభుత్వం డీసీఐ అమ్మకాలను విరమించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు సిహెచ్.నర్సింగరావు, విఎస్ పద్మనాభరాజు పాల్గొన్నారు.