ఆంధ్రప్రదేశ్‌

కృష్ణాలో ఘనంగా ‘పోలి స్వర్గం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (ఇంద్రకీలాద్రి), నవంబర్ 19: కార్తీక మాసోత్సవం ముగిసిన సందర్భంగా ఆదివారం వేకువజామున మహిళలు భక్తిప్రపత్తులతో ‘పోలి స్వర్గం’ కార్యక్రమం నిర్వహించుకున్నారు. వందల సంఖ్యలో మహిళలు అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి నదిలో విడిచిపెట్టటంతో వేకువజామున పవిత్ర కృష్ణానది దీపకాంతులతో వెలిగిపోయింది. భక్తులు తొలుత కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు ఆచరించి గట్టు మీద దీపారాధన చేశారు.
తరువాత పరమేశ్వరుని ధ్యానిస్తూ అరటి దొప్పల్లో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి, నదిలో విడిచిపెట్టి పోలి స్వర్గం కార్యక్రమాన్ని ముగించారు. నదికి సమీపంలోని శ్రీ విజయేశ్వర స్వామి, ఇంద్రకీలాద్రి మల్లేశ్వర స్వామి, పాతబస్తీ శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామి (పాత శివాలయం), బ్రాహ్మణ వీధి శ్రీ వసంత మల్లిఖార్జున స్వామి (బుద్దావారి గుడి), తదితర ఆలయాల్లో తమ మొక్కుబడులకు అనుగుణంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు.

చిత్రం..విజయవాడ కృష్ణానదిలో ఆదివారం వేకువజామున దీపాలు వదిలి ‘పోలి స్వర్గం’ నిర్వహిస్తున్న మహిళా భక్తులు