ఆంధ్రప్రదేశ్‌

నాటి ‘కోతలు’ ఓ పీడకల!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, నవంబర్ 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రెండో దశ విద్యుత్ సంస్కరణలు సత్ఫలితాలనిస్తున్నాయి. నిరంతర విద్యుత్ సరఫరా పథకంతో మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఆవిర్భవించిన ఏపీ ఈ ఫలాలను వినియోగదారులకు చేర్చడానికి నిశ్చయించింది. రాష్ట్ర సమగ్ర ఆర్థికాభివృద్ధి కోసం 15శాతం వృద్ధిరేటు సాధన లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2019 నాటికి 179 బిలియన్ యూనిట్ల డిమాండ్‌ను తీరుస్తూ నిర్దేశిత వృద్ధిరేటును సాధించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలతో సమానంగా వ్యవసాయానికి, రైతాంగానికి ప్రాధాన్యతనివ్వాలని నిర్ణయించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యుత్ రంగానికి దిశను నిర్దేశించారు. 7గంటల నిరంతర, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు విద్యుత్ యంత్రాంగాన్ని ఆదేశించారు. 2014కు ముందు కరెంట్ కోతలు మరచిపోలేని ఓ పీడకలగా ఆయన అభివర్ణించారు. తాప విద్యుత్ ఉత్పత్తిలో అత్యున్నతమైన క్రిటికల్ బాయిలర్ టెక్నాలజీని ఉపయోగించాలని, గ్రీన్ ఎనర్జీ కారిడార్ నిర్మాణానికి మార్గాన్ని వేగవంతం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. అన్ని జిల్లాల్లో 400 కేవీ విద్యుత్ వ్యవస్థ నెలకొల్పి ట్రాన్స్‌కో ఇంధన సామర్ధ్యాన్ని పెంపొందించాలని సూచించారు. కోల్ లింకేజ్, కార్యాచరణ, గ్రామీణ విద్యుదీకరణ అంశాలు, ఇంధన ఆదా, స్మార్ట్ గ్రిడ్, విద్యుత్ వాహనాలు, డిజిటల్ చెల్లింపులు, వౌలిక సదుపాయాల కల్పన పరిస్థితి మదింపునకు ముఖ్యమంత్రి మంగళవారం అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఈనేపథ్యంలో ఆదివారం ఆయన విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు, ఇంధనం, వౌలిక సదుపాయాల కల్పన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, ఐటీ ముఖ్య కార్యదర్శి, ఏపీ ట్రాన్స్‌కో ఎండీ విజయానంద్, ఇంధన శాఖ సలహాదారు కె రంగనాథం, ఏపీ జెన్కో జెఎండీలు దినేష్ పరుచూరి, ఉమాపతి, డిస్కంల సిఎండీలు ఎంఎం నాయక్, హెచ్‌వై దొరతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ‘నీరే ఇంధనం, ఆర్థికాభివృద్ధిలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. రైతు లేనిదే ఏ సమాజానికీ మనుగడ లేదు. పరిశ్రమలకు, వ్యవసాయానికీ, గ్రామీణ, పట్టణ ప్రాంతాలకు సమ ప్రాధాన్యతే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం. అనేక బహుళ జాతి సంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి. ఫైళ్ల కదలికలో జాప్యాన్ని నివారించాం, నిరంతర, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ఆన్‌లైన్‌లో ఒకేసారి అన్ని అనుమతులూ ఇచ్చే విధానంతో రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు సానుకూల వాతావరణం ఏర్పరిచాము’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంతటితోనే సంతృప్తిపడితే సరిపోదని, రైతులు సేద్యం చేసుకునేందుకు అనువైన పరిస్థితిని కల్పించాల్సి ఉందన్నారు. 2017 రబీ సీజన్‌లో ఏప్రిల్ మాసంలో 176 మిలియన్ యూనిట్ల విద్యుత్ డిమాండ్ ఉందని, ఇది వచ్చే ఏడాది రబీ నాటికి ఈ డిమాండ్ 186 మిలియన్ యూనిట్లుగా ఉండవచ్చని అంచనా వేశామని, ఈ దిశగా రబీలో ముందస్తు కార్యాచరణ ప్రణాళికకు కసరత్తు చేయాలని ఇంధన శాఖను ఆదేశించారు. ఈ కార్యాచరణ ప్రణాళికను ముందస్తుగా రూపొందించేందుకు సంసిద్ధులై ఉండాలని కోరారు. సబ్‌స్టేషన్ స్థాయిలో రైతాంగాన్ని కలవాలని, కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ముందు రైతుల సూచనలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. వర్షాలు విస్తారంగా కురవడంతో భూగర్భ జలమట్టాలు సమృద్ధిగా పెరిగాయన్నారు. విద్యుత్ శాఖ మంత్రి కళా వెంకట్రావు మాట్లాడుతూ వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను హైవోల్టేజ్ విద్యుత్ సరఫరా వ్యవస్థతో అనుసంధానించేందుకు కార్యాచరణ ప్రణాళిక తయారీకి కసరత్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ విధానంతో రైతుల వ్యవసాయ అవసరాలకు నాణ్యమైన విద్యుత్ అందించవచ్చని, విద్యుత్ ఉత్పాదన, పంపిణీ నష్టాలను గణనీయంగా తగ్గించవచ్చని మంత్రి వివరించారు. డిస్కం రూ.3626 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో 8,97,000 వ్యవసాయ కనెక్షన్లకు హెచ్‌వీడీస్ అమలు చేస్తున్నామని, ఇందువల్ల వోల్టేజీ హెచ్చుతగ్గుల సమస్య ఉండదని అన్నారు. అజయ్ జైన్ స్పందిస్తూ స్మార్ట్ కన్స్యూమర్ మీటర్లను అమర్చడం మీద దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. విజయానంద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ విద్యుత్ ప్రసార సంస్థకు రూ.133.95 కోట్ల మేర లాభం వచ్చిందని తెలిపారు. విద్యుత్ వ్యవస్థను వౌలిక సదుపాయాల వృద్ధి కోసం పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్, వాణిజ్య బ్యాంకులు దీర్ఘకాలిక చెల్లింపుల విధానంతో రుణాలు ఇచ్చేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నాయని వివరించారు.