ఆంధ్రప్రదేశ్‌

న్యాయవాదులను ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, నవంబర్ 20: గతంలో బతకలేక బడిపంతులు.. నేడు బతకలేని స్థితిలో న్యాయవాది అంటూ సోమవారం శాసనసభ జీరో అవర్‌లో బిజెపి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రస్తావించారు. రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపడతానని పాదయాత్రలో చంద్రబాబు ఇచ్చిన హామీ అమల్లోకి వచ్చేలా చూడాలని కోరారు. సంక్షేమ నిధికి కార్ఫస్ ఫండ్‌ను సమకూర్చాలన్నారు.
శిథిలావస్థలో తుఫాన్ షెల్టర్లు
కోస్తా తీరంలో రేపల్లె, బాపట్ల పరిసరాల్లో దాదాపు 75 తుఫాన్ షెల్టర్లు శిథిలావస్థలోనున్నందున తక్షణం మరమ్మతులు చేపట్టాలని. అవసరమైనచోట్ల కొత్తగా నిర్మించాలని రేపల్లె శాసనసభ్యుడు అనగాని సత్యప్రసాద్ కోరారు.
ఇనాం భూములకు రిజిస్ట్రేషన్ చేయాలి
దేవాలయ అర్చకులు, భజంత్రీలు తమకు సంక్రమించిన ఇనాం భూములను పేదరికంతో మగ్గుతూ విక్రయించుకోగా వాటిని కొనుగోలు చేసినవారికి రిజిస్ట్రేషన్లు జరుగకపోవటంతో వారు ఇబ్బందులు పడుతున్నారని జగ్గయ్యపేట శాసనసభ్యుడు శ్రీరాం రాజగోపాల్ ప్రస్తావించారు.
రైలు ప్రమాదాల్లో మరణించినవారికి అందని చంద్రన్న బీమా
రైలు నుంచి జారిపడి మరణించిన వారికి, రైలు పట్టాలు దాటుతూ ప్రమాదానికి గురై మరణించిన వారికి రైల్వే పోలీస్‌శాఖ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి చేతికి ఇవ్వనందున చంద్రన్న బీమా అందటం లేదంటూ సభ్యులు గొల్లపల్లి సూర్యారావు ఫిర్యాదు చేశారు. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేసేలా రైల్వే పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరారు.